English | Telugu

'జ‌బ‌ర్ద‌స్త్' క‌మెడియ‌న్స్ పారితోషికాలు మ‌రీ ఇంత త‌క్కువా?!

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ న‌లు మూల‌ల్లో వున్న తెలుగు వాళ్ల‌ని క‌డుపుబ్బా న‌వ్విస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్న షో 'జ‌బ‌ర్ద‌స్త్‌'. ఈ కామెడీని షోని కొట్టే షో ఇంత వ‌ర‌కు రాలేదంటే దీని ప్ర‌త్యేక‌త ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌లా పాపులారిటీని సొంతం చేసుకుని ఇప్ప‌టికీ టాప్ పొజీష‌న్‌లో కొన‌సాగుతోంది. ఈ షోని చూసి హాయిగా న‌వ్వుకుని ట్రెస్ రిలీఫ్‌ ఫీల‌య్యే హాస్య ప్రియులు ఎంద‌రో వున్నారు.

ఈ షో వ‌ల్ల పాపుల‌ర్ అయి సినిమాల్లో అవ‌కాశాల్ని సొంత చేసుకున్న వాళ్లే కాకుండా బిగ్ బాస్ హౌస్‌లో ప్ర‌వేశించిన వాళ్లూ వున్నారు. గెట‌ప్ శ్రీ‌ను, ముక్కు అవినాష్‌, సుడిగాలి సుధీర్‌, రామ్ ప్ర‌సాద్‌, హైప‌ర్ ఆది, షేకింగ్ షేషు, శాంతి స్వ‌రూప్‌.. ఇలా చాలా మందే వున్నారు. అయితే 'జ‌బ‌ర్ద‌స్త్‌' షో కు భారీ స్థాయిలో టీఆర్పీ వ‌స్తుండ‌టంతో వీరి పారితోషికాలు కూడా భారీ స్థాయిలోనే వుంటాయ‌ని బ‌య‌ట టాక్‌.

అయితే అందులో నిజం లేద‌ని లేడీ క్యారెక్ట‌ర్స్‌తో న‌వ్వించే శాంతి స్వ‌రూప్ చెబుతున్నాడు. ల‌క్ష‌ల్లో పారితోషికాలు అన్న‌ది టీమ్ లీడ‌ర్‌ల‌కి త‌ప్ప మిగ‌తా వారికి లేవ‌ని, 5 వేలు, మూడు వేలు, 2500ల‌కు కూడా స్కిట్‌లు చేస్తున్న వాళ్లు కూడా వున్నార‌ని, ఒక్కో సంద‌ర్భంలో టీవీలో క‌నిపిస్తే చాల‌ని ఫ్రీగా కూడా స్కిట్‌లు చేసిన వాళ్లు కూడా ఇక్క‌డ వున్నార‌ని షాకింగ్ నిజాలు తాజాగా బ‌య‌ట‌పెట్టాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.