English | Telugu

సీరియ‌ల్స్ స‌క్సెస్‌.. ప్రొడ్యూస‌ర్‌గా ఫెయిల్‌!

బుల్లితెరపై చాలా కాలంగా కొనసాగుతున్న సీరియల్స్ లో 'వదినమ్మ' ఒకటి. దర్శకనిర్మాత, నటుడు ఈటీవీ ప్రభాకర్, సుజిత జంటగా నటిస్తోన్న ఈ సీరియల్ ప్రేక్షకాదరణ పొందింది. ఈ క్రమంలో నటుడిగా, దర్శకనిర్మాతగా తన ప్రస్థానం గురించి ప్రభాకర్ తాజాగా ముచ్చటించారు. 'వదినమ్మ' సీరియల్ లో అసలైన హీరో తను కాదని.. వదినమ్మే సీరియల్ హీరో అని చెప్పుకొచ్చాడు. మేమంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అని అన్నారు. సీరియల్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడానికి సాక్ష్యం 500 వందల ఎపిసోడ్స్ పూర్తి కావడమేనని అన్నారు.

మిగిలిన సీరియల్స్ కి భిన్నంగా ఫ్యామిలీ రిలేషన్స్ తో ఈ సీరియల్ ను నడిపిస్తున్నామని.. ప్రొడ్యూసర్ గా తనకు ఉండే కష్టాలు ఉంటాయని.. పాజెక్ట్ కి కావాల్సిన ప్రతిదీ అరేంజ్ చేయాలని అన్నారు. ఇంతకుముందులా కాకుండా.. ప్రేక్షకులు అంతకుమించి క్వాలిటీను కోరుకుంటున్నారనీ, ఫ్రేమ్ లో ఒకరిద్దరు ఉంటే ఒప్పుకోవడం లేదని.. ప్రతీ ఫ్రేమ్ లో ఆర్టిస్ట్ లు ఫుల్ గా కనిపించాలని కోరుకుంటున్నారని అన్నారు.

పరిమిత ఫండింగ్ తో క్వాలిటీ సీరియల్ చేయడం మహాకష్టమని చెప్పుకొచ్చారు. తను నిర్మించిన సీరియల్స్ సూపర్ సక్సెస్ అయ్యాయని.. కానీ నిర్మాతగా, ఫైనాన్స్ పరంగా సక్సెస్ కాలేకపోయానని అన్నారు. మిగతా నిర్మాతలు ఆర్థికంగా ఎలా సక్సెస్ అవుతున్నారో.. అడిగి తెలుసుకోవాలని అన్నారు. సినిమా, టీవీ అనేది పక్కన పెడితే తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.