English | Telugu

ఢీ కంటెస్టెంట్ల బాగోతాలు.. వీడియోలు బయటపెట్టిన ప్రదీప్!

బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ వచ్చే షోలలో 'ఢీ' ఒకటి. ఈ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొన్న చాలా మంది టాప్ కొరియోగ్రాఫర్లుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ షోపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పటిలా షో ఉండడం లేదని.. డాన్స్ కరువైందని విమర్శలు చేస్తున్నారు. 'ఢీ' షోలో బయట కనిపించేది వేరు.. లోపల జరిగేది వేరు అంటూ రాకేష్ మాస్టర్ ఇటీవల సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

'ఢీ' కంటెస్టెంట్లంద‌రూ ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారని.. క్రమశిక్షణతో ఉండరని రాకేష్ మాస్టర్ అన్నారు. జ‌డ్జిలు, యాంకర్లు కూడా అంతేనని అన్నారు. మనకు కనిపించే షో అంతా కూడా ఎడిట్ చేసిన వర్షెన్ అని.. కానీ సెట్స్‌లో కంటెస్టెంట్లు, యాంకర్లు, జడ్జిలు చేసే హల్చల్ అంతా ఇంతా కాదని చెప్పుకొచ్చారు తాజాగా అందులో కొన్ని విషయాలను యాంకర్ ప్రదీప్ బయటపెట్టాడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో అందరూ రీల్స్ వీడియోలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అలానే 'ఢీ' కంటెస్టెంట్లు షూటింగ్ గ్యాప్‌ లో రీల్ వీడియోలతో రచ్చ చేస్తున్నారని.. కొన్ని వీడియోలు చూపించాడు ప్రదీప్.

ఓ వీడియోలో మణికంఠ, నైనికలు చేసిన ముద్దు సీన్ చూసి అందరూ షాకయ్యారు. ఇక ఈ వీడియోపై వచ్చిన మీమ్స్ చూసి అందరూ నవ్వుకున్నారు. 'జాతిరత్నాలు' సినిమాలో "చిట్టి" సాంగ్‌కి మణికంఠ, నైనిక డాన్స్ చేస్తుంటే.. అది చూసిన జిత్తు మాస్టర్ ఇచ్చే ఎక్స్‌ప్రెష‌న్స్‌పై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేశారు. ఇక ప్రసాద్, నైనిక చేసిన రొమాంటిక్ డాన్స్ వీడియోపై అభి మాస్టర్ కుమిలి కుమిలి ఏడ్చినట్టు చూపించారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది!

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.