English | Telugu

మా ఊరి దేవుడు వచ్చేస్తున్నాడు!

మల్లెమాల టీమ్ ప్రతీ పండగను కాష్ చేసుకోవడంలో తన మార్క్ చూపిస్తూనే ఉంటుంది. అంతే కాదు తన ఆడియన్స్ ని మెప్పిస్తూ ఉండేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తుంది కూడా. కొంతకాలం క్రితం వరకు మల్లెమాల మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా వాటిని కాదని తన దారిలో తాను పోతోంది. ప్రతీ పండగకు కొత్తగా ఆలోచిస్తూ చేసే కార్యక్రమాలు చాలా కలర్ ఫుల్ గా జోష్ ఫుల్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా వినాయక చవితి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసింది మల్లెమాల. "మా ఊరి దేవుడు" పేరుతో చేసిన ఈ ఈవెంట్ చేశారు.

ఈ ప్రోమోలో నాగినీడు, ఖుష్బూ, అన్నపూర్ణ, జయసుధ, ప్రగతి, ప్రదీప్, రష్మీ ఇలా ఎంతో మంది కనిపించబోతున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రోమోలో కమెడియన్స్ అంత అవుట్ డోర్ షూటింగ్ చేశారు. పిచ్చి వాళ్ళుగా నటిస్తూ ప్రాంక్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. అలాగే ఆది, రాంప్రసాద్, గెటప్ శీను అందరూ దుమ్ము రేపే పెర్ఫార్మెన్సులు ఇచ్చారు. డాన్స్ లతో స్టేజిని ఇరగదీసేసారు. ఇంద్రజ డాన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఈ ఈవెంట్ ప్రోమో చూస్తుంటే ఫుల్ ఎంటర్టైన్ చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక ఈ షోని ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నట్టుగా నాగినీడుతో చెప్పేస్తుంది మల్లెమాల టీమ్. ఇలా ఈ వినాయక చవితి షో మస్త్ ఎంటర్టైన్ చేయనుంది ఆడియన్స్ని.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.