English | Telugu
Podharillu: డ్రైవర్ గా చక్రి.. మేనబావకి పెళ్ళిచూపులని గాయత్రీ ఎమోషనల్!
Updated : Dec 19, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -09 లో.... గాయత్రి, మాధవ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. మరొకవైపు భూషణ్ పేపర్ చదువుతు చిరాకు పడుతాడుమ ఇక్కడ పేపర్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి న్యూస్ లు వస్తాయి.. అందుకే నాకు ఇక్కడ ఉండాలనిపించదని చిరాకు పడుతాడు. అప్పుడే ఆదికి వాళ్ళ నాన్న ఫోన్ చేసి.. మీకు ఒక డ్రైవర్ ని ఏర్పాటు చేసానని చెప్తాడు. అదే విషయం భూషణ్ కి కూడా చెప్తాడు. అప్పుడే చక్రి ఎంట్రీ ఇస్తాడు.
అతన్ని చూసి భూషణ్ కోప్పడుతాడు. వీడు ఇక్కడ ఉన్నాడంటే ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుందని చక్రి అనుకుంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని భూషణ్ కోప్పడుతాడు. డ్రైవర్ గా వచ్చానని చక్రి అనగానే అంటే డాడీ పంపింది ఇతన్నే అనుకుంటానని ఆది అంటాడు. వీడు నాకు ఇష్టం లేదని భూషణ్ అంటాడు. అప్పుడే మహా వస్తుంది. ఈ అమ్మాయి కోసం అయిన ఇక్కడే ఉండాలని.. సారీ సర్ నిన్న నా మిస్టేక్ అని భూషణ్ ఇగో సాటిస్ఫాక్షన్ అయ్యేలా మాట్లాడుతాడు. దాంతో భూషణ్ ఒప్పుకుంటాడు. వాడిది తప్పు అయినా అతనికి తప్పు అనేలా చేసాడని మహా అనుకుంటుంది. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తారు. మహా చేత్తో తింటుంటే ఎందుకలా తింటున్నావ్.. కెనడాలో అలా తింటే నవ్వుకుంటారని భూషణ్ అనగానే మహాకి ఇంకా కోపం వస్తుంది.
మరొకవైపు మాధవకి పెళ్ళిచూపులు అవుతుంటాయి. చూసుకోవడానికి అమ్మాయి వాళ్ళు వస్తారు. ఇల్లు ఇదేనా అని మాట్లాడుతారు. పెళ్లి ఫిక్స్ అయితే రిపేర్ చేయించడం ఎంతసేపు అని నారాయణ అంటాడు. ఆమ్మో బావ పెళ్లి ఫిక్స్ అయ్యేలా ఉందని కిటికీలో నుండి చూస్తూ గాయత్రి అనుకుంటుంది. అది కేశవ చూసి గాయత్రీ అక్కడ ఉంది.. కన్నా తనని పంపించు అని చెప్తాడు. కన్నా వెళ్లి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పి తనని పంపిస్తాడు. గాయత్రి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.