English | Telugu

కార్తికేయ‌కు ఎవ‌రూ పిల్ల‌నిచ్చేలా లేర‌ట‌!

`Rx 100` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నారు యువ హీరో కార్తికేయ గుమ్మ‌కొండ‌. గ‌త కొంత కాలంగా ఆ స్థాయి విజ‌యం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ మూవీ ద్వారా వ‌చ్చిన ఇమేజ్‌ని కూడా మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. తాజాగా కార్తీకేయ న‌టించిన చిత్రం `చావు క‌బురు చ‌ల్ల‌గా`. ఈ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఈ సంద‌ర్భంగా ఆలీ వ్యాఖ్యాత‌గా ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న `అలీతో సరదాగా` కార్య‌క్ర‌మంలో కార్తికేయ, లావ‌ణ్య త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆలీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కార్తికేయ చెప్పిన స‌మాధానాలు న‌వ్వులు పూయిస్తున్నాయి. మీ నాన్న ఏం చేస్తుంటారు` అని ఆలీ అడిగితే కార్తికేయ అనుకోకుండా `Rx 100` స్కూల్ అని చెప్పి వెంట‌నే నాలుక్క‌రుచుకోవ‌డం.. అదేంటి అని ఆలీ, లావ‌ణ్య త్రిపాఠి ఘోల్లున న‌వ్వ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

ఇంత‌కీ పెళ్లెప్పుడ‌ని ఆలీ అడిగితే ఇప్పుడున్న ఇమేజ్‌ని మార్చుకున్నాక చేసుకుంటాన‌ని, పెళ్లి గురించి అడిగితే వామ్మో వీడా అంటున్నార‌ని కార్తికేయ చెబుతున్నాడు. ఏంటీ ఇండ‌స్ట్రీలో క్ర‌ష్ వున్న హీరో ఎవ‌ర‌ని లావ‌ణ్య‌ని అడిగితే ఎవ‌రూ లేర‌ని చెప్ప‌డం, ఆ వెంట‌నే ఆఅలీ అందుకుని అంద‌రిని అన్న‌య్య అంటావంట క‌దా ఇక క్ర‌ష్ ఏముంటుందిలే అని ఆలీ త‌న‌దైన స్టైల్లో పంచ్ వేయ‌డం హిలేరియ‌స్‌గా వుంది. ఈ ఎపిసోడ్ ఈ నెల 29న ఈటీవీలో ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుంత సంద‌డి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.