English | Telugu

దీప కోసం ముర‌ళీకృష్ణ తీసుకున్న నిర్ణ‌యం ఏంటీ?

`కార్తీక దీపం` ర‌స‌వ‌త్త‌ర మ‌లుపులు తిరుగుతూ క్ర‌మ క్ర‌మంగా ఎండింగ్ స్టేజ్‌కి వ‌చ్చేస్తోంది. గ‌త నాలుగేల్లుగా కంటిన్యూ అవుతున్న స‌స్పెన్స్‌కి త్వ‌ర‌లో తెర ప‌డ‌బోతోంది. త‌న భ‌ర్త‌ని, తండ్రిని, అత్త‌ని కాద‌ని పిల్ల‌ల‌తో ఊరు వ‌దిలి వెళ్లిన దీప మ‌రో చోట కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. కొత్త‌గా టిఫిన్ సెంట‌ర్‌ని ప్రారంభిస్తుంది. దీప‌ని వెతుక్కుంటూ వ‌చ్చిన ముర‌ళీకృష్ణ అదే టిఫిన్ పాయింట్ వ‌ద్ద‌కు వ‌చ్చి దీప కోసం ఆరా తీస్తాడు.

ఇంత‌లో దీప ఆటోలో వ‌చ్చి ముర‌ళీ కృష్ణ‌కు క‌నిపిస్తుంది. ఎలాంటి ఇంటి కోడ‌లివి ఇలా వుండ‌టం ఏంట‌మ్మా. రామ్మా మ‌నింటికి పోదాం అంటాడు ముర‌ళీక‌ష్ణ‌. నాకు ఇల్లు ఎక్క‌డుంది నాన్నా ఖాలీ చేశానుగా అంటుంది దీప‌. నీకు పుట్టిల్లుంది, మెట్టినిల్లుంది.. నీకు ఏ ఇల్లు కావాలంటే ఆ ఇంట్లో వుండు.. కానీ నువ్వు రావ‌డ‌మే అంద‌రికి ముఖ్యం` అంటాడు ముర‌ళీకృష్ణ‌. ఆ అంద‌రిలో నా భ‌ర్త లేడు క‌దా నాన్నా అంటుంది దీప‌. ఇంత‌లో సౌంద‌ర్య.. ముర‌ళీకృష్ణ‌కు ఫోన్ చేస్తుంది. దీప క‌నిపించిందా? క‌నిపించినా రానంటోందా? అని అడుగుతుంది. ఈ లోగా త‌ను క‌నిపించిన విష‌యం సౌంద‌ర్యకు చెప్పొద్ద‌ని ఒట్టు వేయించుకుంటుంది. దీంతో త‌ను ఇంకా క‌నిపించ‌లేద‌ని చెబుతాడు ముర‌ళీకృష్ణ‌.

ఏడుస్తూనే ఫోన్ పెట్టేస్తాడు. నా భ‌ర్తే స్వ‌యంగా వ‌చ్చి పిలిచేంత వ‌ర‌కు నేను రాన‌ని చెబుతుంది దీప‌. దీంతో ముర‌ళీకృష్ణ ఓ నిర్ణ‌యం తీసుకుంటాడు. త‌ను తీసుకున్న నిర్ణ‌యం ఏంటీ? అందుకు దీప ఎలా స్పందించింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.