English | Telugu

అఖిల్ ఇంటికి వెళ్లిన గంగ‌వ్వ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్స్ అఖిల్ సార్థ‌క్‌‌, గంగ‌వ్వ మధ్య మంచి అనుబంధం వున్న విష‌యం తెలిసిందే. హౌస్‌లోకి ఎంట‌రైన ద‌గ్గ‌రి నుంచి ప్ర‌తి విష‌యంలోనూ గంగ‌వ్వ అఖిల్‌ని స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది. ఒక ద‌శ‌లో గంగ‌వ్వ అనారోగ్యంతో హౌస్‌ని వీడుతున్న సంద‌ర్భంగా అఖిల్ భావోద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అక్క‌డి నుంచి వీరి మ‌ధ్య అనుబంధం మ‌రింత పెరిగింది.

ప్ర‌స్తుతం మోనాల్ గ‌జ్జ‌ర్‌తో క‌లిసి 'తెలుగ‌బ్బాయి గుజ‌రాతీ అమ్మాయి' పేరుతో రూపొందుతున్న వెబ్ సిరీస్ లో న‌టిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా కొత్త కారు‌ని తీసుకున్నాడు అఖిల్. ఆ కారుని గంగ‌వ్వ ఇంటికి పంపించి ఆమెను త‌న ఇంటికి ర‌ప్పించుకున్న అఖిల్ ఆమెకు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. గంగ‌వ్వ‌ని అఖిల్ ఇంటికి తీసుకెళితే అత‌ని పేరెంట్స్ గంగ‌వ్వ‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

అమెకు కాలి ప‌ట్టీలు కొనివ్వ‌డంతో గంగ‌వ్వ ఎమోష‌న‌ల్ అయింది. స‌ర‌దాగా అఖిల్ తో గ‌డిపిన త‌రువాత త‌న కొడుకు త‌న‌ని చూసుకునేలా లేడని, అఖిల్‌ని ఇంటికి తీసుకెళ‌తాన‌ని గంగ‌వ్వ స‌ర‌దాగా అంది. ఆ త‌రువాత త‌న ఇంటికి బ‌య‌లుదేర‌గానే అఖిల్ భావోద్వేగానికి లోన‌య్యాడు. గంగ‌వ్వ "బంగారం" అంటూ క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.