English | Telugu

1000వ ఎపిసోడ్‌.. దీప‌ని గుండెల‌కు హ‌త్తుకున్న డాక్ట‌ర్ బాబు!

'కార్తీక దీపం' ఈ మంగ‌ళ‌వారం `1000`వ ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. ఈ సంద‌ర్భంగా ఈ సీరియ‌ల్ స‌రికొత్త మ‌లుపు తిరిగింది. దీప ఎక్క‌డుందో ప్రియ‌మ‌ణితో చెబుతుండ‌గా చాటుగా విన్నడాక్ట‌ర్ బాబు త‌న‌ని వెతుక్కుంటూ బ‌య‌లుదేర‌తాడు. అప్ప‌టికే దీప‌ని హాస్ప‌ట‌ల్ నుంచి తండ్రి ముర‌ళీకృష్ణ ఇంటికి తీసుకొస్తాడు. పిల్ల‌లు శౌర్య‌, హిమ టిఫిన్ సెంట‌ర్ ప‌ని తాము చూసుకుంటామ‌ని, అంతవ‌ర‌కు త‌న‌ని రెస్ట్ తీసుకోమ‌ని దీప‌తో చెబుతారు.

హిమ టిఫిన్ సెంట‌ర్‌కి వెళితే శౌర్య దీప ద‌గ్గ‌ర వుంటుంది. అది గ‌మ‌నించిన దీప... "హిమ ప‌ని చేయ‌డం డాక్ట‌ర్ బాబుకి న‌చ్చ‌దు. అయ‌న ప‌క్క‌న లేకున్నా ఆయ‌న‌కు న‌చ్చ‌ని ప‌నులు హిమ‌తో చేయించొద్దు." అని చెబుతుంది.. "స‌రే స‌రే" అంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది శౌర్య‌.. క‌ట్ చేస్తే శౌర్య‌‌ని త‌లుచుకుంటూ ఓ టిఫిన్ సెంట‌ర్ వ‌ద్ద టిఫిన్ చేస్తుంటాడు డాక్ట‌ర్ బాబు. ఇంత‌లో సౌంద‌ర్య ఫోన్ చేసి "ఎక్క‌డికి వెళ్లావ్?" అని అడుగుతుంది. "నాకు న‌చ్చ‌ని ప‌ని మీద వ‌చ్చాను. త్వ‌ర‌లోనే వ‌స్తాన‌"ని చెబుతాడు డాక్ల‌ర్ బాబు.

ఈ విష‌యం ఆనంద‌రావుతో చ‌ర్చిస్తుండ‌గానే మోనిత వ‌స్తుంది. "డాక్ట‌ర్ బాబు ఫోన్ ఎత్త‌డం లేదు. ఇంట్లో వున్నాడా? అని అడ‌గ‌డానికి వ‌చ్చాను" అంటుంది మోనిత‌. క‌ట్ చేస్తే టిఫిన్ సెంట‌ర్ క‌స్ట‌మ‌ర్ల‌తో నిండిపోయి వుంటుంది. ఇంత‌లో ఓ క‌స్ట‌మ‌ర్ "చ‌ట్నీ" అంటూ కేకేస్తాడు. హిమ ప‌ట్టుకుని వెళుతుంటే ఓ చేయి అడ్డుప‌డుతుంది.. అదే డాక్ట‌ర్ బాబు... అత‌న్ని చూడ‌గానే హిమ క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ దృశ్యాన్ని చూసి దీప తండ్రి ముర‌ళీ కృష్ణ షాక్‌కు గుర‌వుతాడు. ఆ త‌రువాత ఇద్ద‌రు పిల్ల‌లు "నాన్నా" అంటూ డాక్ట‌ర్ బాబు ద‌గ్గ‌రికి వ‌చ్చారు. ఈ లోగా ద‌గ్గుతూ, తూలుతూ దీప బ‌య‌టికి వ‌స్తుంది. ఆమెని చూసి ఇద్ద‌రు పిల్ల‌లు "అమ్మా" అంటూ డాక్ట‌ర్ బాబుని వ‌దిలి దీప ద‌గ్గ‌రికి వెళ‌తారు. దీప‌ని అలా చూసిన డాక్ట‌ర్ బాబు క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. వెంట‌నే దీప‌ని హ‌త్తుకుంటాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది ఆస‌క్తిక‌రం.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.