English | Telugu

'జ‌‌బ‌ర్ద‌స్త్' షో.. రోజా ప్లేస్‌లో ఇంద్ర‌జ‌!

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న మోస్ట్ పాపుల‌ర్ డ‌బ‌ల్‌ కామెడీ షో 'జ‌బ‌ర్ద‌స్త్'. గ‌త ఎనిమిదేళ్ల క్రితం మొద‌లైన ఈ కామెడీ షో విజ‌య‌వంతంగా ర‌న్న‌వుతోంది. ఈ షోకి మొద‌ట‌ రోజాతో క‌లిసి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత వ్య‌క్తిగ‌త కారణాల‌ దృష్ట్యా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన నాగ‌బాబు త‌ప్పుకున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న స్థానంలో సింగ‌ర్ మ‌నో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

గ‌త కొంత కాలంగా రోజా, మ‌నో 'జ‌బ‌ర్ద‌స్త్' టీమ్ మెంబ‌ర్స్‌, టీమ్ లీడ‌ర్స్‌పై పంచ్‌లు వేస్తూనే వున్నారు. అయితే ఈ జోడీకి తాజాగా బ్రేక్ ప‌డింది. గ‌త కొన్నేళ్లుగా జంట‌గా కంటెస్టెంట్‌ల‌ని ఎంక‌రేజ్ చేస్తున్న మ‌నో, రోజాల జోడీ తాజాగా విడిపోయింది. రోజాకు ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌డం, ఆమెకు ఇటీవ‌ల చెన్నైలో స‌ర్జ‌రీలు జ‌ర‌గ‌డంతో కొన్ని వారాల పాటు రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని డాక్ట‌ర్లు సూచించార‌ట‌.

ఈ నేప‌థ్యంలో రోజా ఈ షో నుంచి తాత్కాలికంగా త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆమె స్థానంలో ఒక‌ప్ప‌టి హీరోయిన్ ఇంద్ర‌జ‌ని రంగంలోకి దింపేశారు. ఇందుకు సంబంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. రోజా త‌ర‌హాలో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌నోతో క‌లిసి ఇంద్ర‌జ షోని హుషారెత్తిస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.