English | Telugu

వ‌ర్ష‌ని కొట్ట‌బోయిన చంటి.. షాకైన జ‌బ‌ర్ద‌స్త్ కమెడియ‌న్స్‌!

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న‌ పాపుల‌ర్ షోగా 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'కు మంచి పేరుంది. సామాన్యుల ద‌గ్గ‌రి నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ న‌వ్వులు పూయిస్తున్న ఈ షో వారం వారం మ‌రింత‌గా పాపుల‌ర్ అవుతూ న‌వ్విస్తోంది. ఇదిలా వుంటే ఈ వారం కామెడీ కాస్తా సీరియ‌స్ సీన్‌గా మారిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ వారం ఈ షో కోసం 'ఏప్రిల్ ఫూల్' పేరుతో ఓ స్కిట్‌ని వ‌ర్ష‌, కార్తీక్ చేశారు.

మిమ్మ‌ల్ని మీరే ఫూల్స్‌ని చేసుకోవ‌డం కాదు టీమ్ లీడ‌ర్‌ల‌ని ఏప్రిల్ ఫూల్ చేయ‌మ‌ని రోజా చెబుతుంది. దీంతో రెచ్చిపోయిన వ‌ర్ష‌, కార్తీక్.. మొద‌ట హైప‌ర్ ఆదీని ఏప్రిల్ ఫూల్‌ని చేస్తారు. ఫూల్‌గా మారిన హైప‌ర్ ఆది డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌తో వ‌ర్ష‌ని నిరుత్సాహ‌ప‌రుస్తాడు. ఆ త‌రువాత ఈ ఇద్ద‌రూ క‌లిసి చ‌లాకీ చంటీని ఏప్రిల్ ఫూల్ చేయాల‌ని ట్రై చేస్తారు. చివ‌రికి ఫూల్‌ని చేసేస్తారు కూడా.

ఈ క్ర‌మంలో వ‌ర్ష ..చ‌లాకీ చంటి అన్న మాట‌ల‌కు హ‌ర్ట్ అయ్యాన‌ని ఫ‌స్ట్ ఫ్లోర్‌కి ఎక్కేసి అక్క‌డి నుంచి దూకేస్తాన‌ని భ‌య‌పెడుతుంది. ఆ త‌రువాత చంటి భ‌య‌ప‌డ‌టం చూసి కిందికి వ‌చ్చేసి ఏప్రిల్ ఫూల్ అనేస్తుంది. దీంతో చిర్రెత్తు కొచ్చిన చంటి ఆమెని కొట్టినంత ప‌నిచేస్తాడు. దాంతో వ‌ర్ష స‌హా అక్క‌డున్న వాళ్లంతా స్ట‌న్న‌యిపోతారు. చిన్న పొర‌పాటు జ‌రిగి త‌ను కింద ప‌డితే ఎవ‌రు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటార‌ని కార్తీక్‌పై ఫైర్ అవుతాడు చంటి. ఇంత‌లో అక్క‌డికి చేరిన జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ మెంబ‌ర్స్ అంతా కార్తీక్‌పై ఎదురుతిర‌గ‌డంతో అంతా ర‌సాభాస‌గా మారింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం సంద‌డి చేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.