English | Telugu

నేటి నుంచే రాఘ‌వేంద్రుడి సీరియ‌ల్‌.. ఎలా ఉండ‌బోతోంది?

`కార్తీక దీపం` థీమ్‌ని ఫాలో అవుతూ ద‌ర్శకేంద్రుడు కె. రాఘ‌వేంద్రరావు స‌మ‌ర్ప‌ణ‌లో రాబోతున్న స‌రికొత్త ధారావాహిక `కృష్ణ తుల‌సి`. జీ తెలుగులో ఈ నెల 22 నుంచి ఈ సీరియ‌ల్ ప్ర‌సారం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. న‌లుపు వ‌ర్ణంలో వున్న అమ్మాయి శ్యామా.. చీక‌టంటే ప‌డ‌ని అఖిల్ మ‌ధ్య సాగే క‌థ‌గా ఈ సీరియ‌ల్‌ని రూపొందించారు.

న‌లుపు రంగులో వుండే శ్యామా అడుగ‌డుగునా అవ‌మానాలు... ఈస‌డింపులు.. ఎదుర్కొంటూ వుంటుంది. అలాంటి అమ్మాయికి అత్యంత ధ‌న‌వంతుల అబ్బాయి అఖిల్‌కి జోడీ ఎలా కుదిరింది.. రెండ‌వ కోడ‌లిగా‌ మిస్ హైద‌రాబాద్‌ని ఇంటికి తెచ్చుకున్న అత్త‌గారు న‌లుపంటేనే భ‌య‌ప‌డే అఖిల్‌కి భార్య‌గా శ్యామాని అంగీక‌రిస్తుందా?.. ఈ వెలుగు నీడ‌ల ప్ర‌యాణంలో శ్యామా క‌థ ఏ తీరం చేర‌బోతోంది అన్న‌దే `కృష్ణ తుల‌సి` క‌థాగ‌మ‌నం.

ఇప్ప‌టికే ఈ సీరియ‌ల్ కోసం ప్ర‌చారం మొద‌లుపెట్టిన రాఘ‌వేంద్రుడు ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప‌నిలో భాగంగా గ్రామాల్లోని మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు ఇంటింటికి బొట్టు బిళ్ల‌‌ల్ని పంచుతూ ప్ర‌చారం చేయిస్తున్నారు. నేటి (ఫిబ్ర‌వ‌రి 22) నుంచి జీ తెలుగులో సాయంత్రం 6:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ రాఘ‌వేంద్రుడి న‌మ్మ‌కాన్ని నిజం చేస్తుందా? లేదా అన్న‌ది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.