English | Telugu

ముమైత్ ముద్దులు త‌ట్టుకోలేక‌పోయిన అవినాష్‌!

"ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే.. చిటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే.." అంటూ టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది ముమైత్‌ఖాన్. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న ముమైత్ తాజాగా ఓంకార్ నిర్వ‌హిస్తున్న డ్యాన్స్ షో `డ్యాన్స్ ప్ల‌స్‌`లో న్యాయ నిర్ణేత‌గా ప్ర‌త్య‌క్ష‌మైంది. గ‌త కొన్ని వారాలుగా ఈ షో విజ‌య‌వంతంగా ప్ర‌సార‌మౌతోంది.

శ‌నివారం, ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోలో టాలెంటెడ్ డ్యాన్స‌ర్స్ త‌మ పెర్ఫార్మెన్స్‌తో అబ్బుర‌ప‌రుస్తున్నారు. ఇదిలా వుంటే ఈ షోకు మ‌రింత ప్ర‌త్యేక‌త‌ని, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని జోడించ‌డానికి ఓంకార్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌ని రంగంలోకి దింపేశాడు. టూ వీక్స్‌కి ఒక‌సారి ఏదో ఒక గెట‌ప్‌తో అవినాష్ `డ్యాన్స్ ప్ల‌స్` స్టేజ్‌పై త‌న‌దైన స్టైల్లో ఎంట‌ర్‌టైన్‌చేస్తూ న‌వ్వులు కురిపిస్తున్నాడు.

గ‌త వారం పోస్ట్‌మ‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన న‌వ్వుల వ‌ర్షం కురిపించి ముమైత్‌తో ఆడుకుంటే ఈ సారి ముమైత్ .. అవినాష్‌తో ఆడుకోబోతోంది. వ‌య‌సు మ‌ళ్లిన‌ వ్య‌క్తిగా.. పండు ముస‌లి గెట‌ప్‌లో అవినాష్ స్టేజ్‌పై కొచ్చాడు. ముమైత్ నుంచి ఓ ముద్దు కావాలంటూ సైగ చేశాడు. ముమైత్ దొరికిందే అవ‌కాశం అనుకుని అవినాష్‌ని ముద్దుల్లో ముంచెత్తింది.. ఎంత‌లా అంటే ఊపిరాడక అవినాష్ ఫ్లోర్‌పై ప‌డి దొర్లేంత‌!.. వ‌చ్చే వారం ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.