English | Telugu

'కార్తీక దీపం'లో షాకుల మీద షాకులు!

బుల్లితెర ధారావాహిక 'కార్తీక దీపం' రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈ సోమ‌వారం 969వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు మోనిత ఏం చేయ‌బోతోంది.. దాని వ‌ల్ల దీప ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోబోతోంది.. కార్తీక్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు?.. అన్న‌దే ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. విహారికి పిల్ల‌లు పుట్ట‌ర‌ని డాక్ట‌ర్ ద్వారా తెలుసుకున్న తుల‌సి ఆ విష‌యాన్ని దీప‌కు చెబుతుంది.

ఇలాగైనా నీ కాపురం నిల‌బ‌డితే చాలని చెబుతుంది. "ఇప్పుడు కూడా ఈ అవ‌కాశాన్ని వాడుకోక‌పోతే ఆ దేవుడు నీకు ఇచ్చిన ఈ అవ‌కాశం వృధా అవుతుంది. ఈ నిజం నీ కాపురాన్ని నిల‌బెడితే నాకు కావాల్సింది ఏముంది" అంటుంది తుల‌సి.. క‌ట్ చేస్తే .. కార్తీక్‌ని సౌంద‌ర్య "రేపే క‌దా కోర్టు?"` అన‌డుగుంది. "లేదు.. నేను కేసు విత్‌డ్రా చేసుకున్నాను" అంటాడు కార్తీక్‌.. "అదేంట్రా!" అంటూ షాక‌వుతుంది సౌంద‌ర్య‌. "నేను కోర్టుకు వెళ్ల‌నంటే ఆనందించాల్సింది పోయి అప్సెట్ అవుతావేంటి మ‌మ్మీ" అంటాడు.

ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే మ‌ధ్య‌లో మోనిత ఎంట‌ర‌వుతుంది. తులసితో దీప మాట్లాడిన వీడియోను కార్తీక్‌కి, సౌంద‌ర్య‌కి చూపించి షాకిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? దీప‌ని కార్తీక్ ఏమైనా అన్నాడా?.. తీర్థ‌యాత్ర‌లు తిరిగి వ‌చ్చిన‌ 'అర్ధ‌పావు' భాగ్యం త‌న ఇంటికి వ‌చ్చిన కార్తీక్‌ని ఏమ‌డిగింది? .. దాంతో కార్తీక్ ఎందుకు షాక‌య్యాడు? .. సౌంద‌ర్య చెప్పిన విష‌యం విని దీప ఎందుకు షాక‌య్యింది?.. ఇంత‌కీ దీప‌కు సౌంద‌ర్య చెప్పిన షాకింగ్ విష‌యం ఏంటీ? అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.