English | Telugu

భానుశ్రీ సంచ‌ల‌నం.. ప‌దేళ్లుగా అత‌నితో అనుబంధం!

బిగ్ ‌బాస్ బ్యూటీ భానుశ్రీ తాజాగా సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టింది. ప్ర‌స్తుతం వెండితెర‌పై హీరోయిన్‌గా అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న భానుశ్రీ గ‌త కొంత కాలంగా శివ శంక‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తితో డేటింగ్ చేస్తోంది. వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి. అయితే తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయ‌ని, బ్రేక‌ప్ చెప్పుకున్నారంటూ తాజాగా ఓ రూమ‌ర్‌ మొద‌లైంది.

దీనిపై భానుశ్రీ స్పందించింది. త‌న‌పై వ‌స్తున్న బ్రేక‌ప్ న్యూస్‌ను ఈ సంద‌ర్భంగా ఖండించింది. త‌ను హైద‌రాబాద్ వ‌చ్చిన‌ కొత్త‌లో నిలువ నీడ కూడా లేని రోజుల్లో త‌ను ఓ జ్యూస్ పాయింట్ వ‌ద్ద వుండేదా‌న్న‌నీ, ఆ స‌మ‌యంలోనే త‌న ఫ్రెండ్ ద్వారా శంక‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తి ప‌రిచ‌యం అయ్యార‌ని, త‌ను ఈ స్థాయికి చేరుకోవ‌డానికి అత‌నే కార‌ణ‌మ‌ని వెల్ల‌డించింది భానుశ్రీ‌.

అంతే కాకుండా త‌ను బిగ్ బాస్ 2‌కి వెళ్లే ముందు చేయి విర‌గ్గొట్టుకుని ప్రాణాపాయ అంచుల దాకా వెళ్లిన స‌మ‌యంలో త‌న‌కు అన్నీ తానై శంక‌ర్‌రెడ్డి నిలిచార‌ని, త‌ను నాకు అమ్మా నాన్న‌కు మించి అనీ, పెళ్లి చేసుకుంటే అత‌డినే చేసుకుంటాన‌నీ భానుశ్రీ వెల్ల‌డించింది. ప‌దేళ్లుగా తాను శంక‌ర్‌రెడ్డితో రిలేష‌న్‌లో వున్నాన‌నీ, త‌న స‌ర్వ‌స్వం అత‌నే అనీ స్ప‌ష్టం చేసింది భానుశ్రీ‌.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.