English | Telugu
Jayam serial : రుద్రతో పారు డీలింగ్.. ముద్దుపెట్టేసిన గంగ!
Updated : Feb 5, 2026
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -185 లో.....రుద్ర, పారు కలిసి బాక్సింగ్ కాంపిటీషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. అది చూసి గంగ కుళ్ళుకుంటుంది. రుద్ర చెప్తుంటే పారు తన వంకే చూస్తుంది. రుద్ర చెయ్ పట్టుకొని మాట్లాడుతుంది. దాంతో రుద్ర కోపంగా చూస్తాడు. రుద్ర, పారు వాళ్లిద్దరూ ఒక గదిలో మాట్లాడుకుంటే.. సూర్య, వంశీ స్నేహ, ప్రమీల, ప్రీతీ బయట ఉండి చూస్తారు.
వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి ముందు సూర్య వెళ్తాడు. ఏదో మాట్లాడాలని వెళ్లి రుద్రతో తిట్లు తిని వెనక్కి వస్తాడు. అలా తర్వాత వంశీ వెళ్తాడు. తను వెళ్లేసరికి పారు, రుద్ర చెయ్ పట్టుకొని ఉంటుంది. దాంతో వంశీ బయటకు వెళ్లి.. వదిన ఆ పారు అన్నయ్య చెయ్ పట్టుకుందని చెప్పగానే గంగ కోపంగా లోపలికి వెళ్తుంది. ఏంటని రుద్ర అనగానే ఏం లేదు సర్ మీకు ఏదైనా కావాలా అని అడగడానికి వచ్చానని గంగ చెప్తుంది. గంగ చూస్తుందని పారు కావాలనే రుద్ర చెయ్ పట్టుకొని ఉంటుంది. సరే వెళ్లి కాఫీ తీసుకొని రమ్మని రుద్ర అనగానే గంగ వెళ్తుంది.
గంగ కోపంగా వాళ్లేమో ఏసీలో ఉంటే నేను మాత్రం కిచెన్ లో వేడికి ఉండాలా అని అంటుంది. వదిన ఆ పారుకి కాఫీలో ఇది కలుపమని కారం పొడి వంశీ ఇస్తాడు. దాంతో ఒక కప్ లో కారం పొడి కలుపుతుంది. ఆ కప్ ని పారు దగ్గర పెడుతుంది. పారుకి డౌట్ వచ్చి రుద్ర దగ్గరున్న కప్ లో ఉన్న కాఫీ తాగుతుంది. కారంపొడి కలిపిన కాఫీ తాగిన రుద్ర మంట, మంట అని అరుస్తాడు. దాంతో గంగ, రుద్రకి కొంగు అడ్డం పెట్టి ముద్దు ఇస్తుంది. అదంతా చూసి పారు కుళ్ళుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.