English | Telugu

Brahmamudi : చక్రవర్తిని పట్టుకోవడానికి కావ్య ప్లాన్.. మినిస్టర్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -947 లో.. రాజ్, కావ్య ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చాడని మినిస్టర్ కోపంతో రాజ్ ఇంటికి వస్తాడు. ఏంటి అందరు భయంగా ఉన్నారు. ఈ రోజు జరిగిన దానికి కారణం ఈ రాజ్, కావ్యనే.. అనవసరంగా నా ఫ్యామిలీ జోలికి వచ్చారు.. ఇప్పుడు ఏమైందో చూసావ్ కదా.. ఇక చూడడాలు ఉండవని మినిస్టర్ వార్నింగ్ ఇస్తాడు. అసలు ఏమైంది రాజ్ అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. నా జోలికి వస్తే ఏం జరుగుతుందో బాగా అర్థమైంది అనుకుంటా.. ఇక నన్ను మీ ఇంటికి రప్పించుకునే ఛాన్స్ ఇవ్వవులే అని వార్నింగ్ ఇచ్చేసి మినిస్టర్ వెళ్ళిపోతాడు. అసలు ఏమైంది రాజ్ వాడు అలా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి ఏం కాలేదు కాబట్టి మంచిది అయింది.. లేదంటే ఎలా ఉండేదని ధాన్యలక్ష్మి అంటుంది.

వాడితో ఎంట్రా గొడవ.. వాళ్ళ ఫ్యామిలీ జోలికి అంటున్నాడని ప్రకాష్ అడుగుతాడు. రాజ్ బిజినెస్ గురించా లేక మీ స్వార్థం కోసమా అని స్వప్న అడుగుతుంది. దాంతో రాజ్ కోపంగా మీకేం తెలుసని మాట్లాడుతున్నారని కోప్పడుతాడు. దాంతో రాజ్ నిజం చెప్పబోతుంటే కావ్య తనని ఆపి. వాడు బిజినెస్ పరంగానే పగ పట్టాడని కావ్య కవర్ చేస్తుంది. ఇంకొకసారి ఎలాంటి సమస్య రానివ్వమని కావ్య అందరికి సారీ చెప్తుంది. మరొకవైపు మినిస్టర్, రుద్రాణి ఇద్దరు డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటారు. నువ్వు ఇచ్చిన ఐడియాతో ఆ రాజ్, కావ్యలకి దిమ్మతిరిగిపోయిందని మినిస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఫ్యామిలీ మొత్తం ఎమోషనల్ ఫూల్స్ అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్, కావ్య మినిస్టర్ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ డాక్టర్ చక్రవర్తిని పట్టుకుంటే అంతా నిజం బయటపడుతుంది. వాడే ఎక్కడో దాచాడు.. చక్రవర్తిని కనిపెట్టడానికి ఇద్దరు ఒక ప్లాన్ చెస్తారు. మరుసటిరోజు తులసి ఇంట్లో కన్పించకపోవడంతో మినిస్టర్ కంగారుపడుతాడు. అప్పుడే రాజ్ ఫోన్ చేసి నీ భార్యని చక్రవర్తి దగ్గరకి తీసుకొని వెళ్తున్నాం.. అక్కడే అతను నీ గురించి చెప్తాడని రాజ్ అనగానే మినిస్టర్ భయంతో చక్రవర్తి దగ్గరికి పరుగులు తీస్తాడు.

మినిస్టర్ ని ఫాలో అవుతూ వెనకాలే రాజ్ వెళ్తాడు. అప్పుడే కావ్య ఫోన్ చేస్తుంది. సిచువేషన్ ఒకే అంత మనం అనుకున్నట్లు గానే జరుగుతుందని రాజ్ చెప్తాడు. మినిస్టర్ చక్రవర్తి ఉన్న దగ్గరికి వెళ్తాడు. మరొకవైపు ఎందుకు కావ్య నన్ను హాస్పిటల్ కి రమ్మన్నావని కావ్యని తులసి అడుగుతుంది. మీకు పాలు సరిపోవడం లేదని అన్నారు కదా ఆయుర్వేద డాక్టర్ వస్తున్నారు. ఆ మందులు వాడితే బాగుంటుందని కావ్య అనగానే కావ్య మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు.. నేను మీకు ఏదైనా చెయ్యాలని తులసి అంటుంది. టైమ్ వచ్చినప్పుడు మీరు చేస్తారని కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య నిజం చెప్తుందేమోనని ప్రేమ టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -386 లో.. రామరాజు హాస్పిటల్ లో ఆ సిచువేషన్ లో ఉంటే భాగ్యం, ఆనందరావు ఇద్దరు భోజనం చేస్తుంటారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఆ విశ్వ గాడు ఏదో మాట్లాడుతా అమూల్యని తీసుకొనిరా అన్నందుకు తీసుకొని వెళ్ళాను కానీ వాడు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటని శ్రీవల్లి కంగారు పడుతుంది. ఏం కాదని భాగ్యం శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తుంటే.. దూరం నుండి నర్మద చూస్తుంది. నర్మద చూసిందని శ్రీవల్లి వెంటనే టేబుల్ కింద దాక్కుంటుంది.

Brahmamudi : మినిస్టర్ ని తక్కువ అంచనా వేసి‌న రాజ్.. చిక్కుల్లోపడ్డ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -946 లో.....రాజ్, కావ్య మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసితో మాట్లాడుతారు. వాళ్ళ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయమని తన భర్తకి తులసి చెప్తుంది. ఒకసారి పాపని ఎత్తుకుంటానని తులసిని కావ్య అడుగుతుంది. సరే అని తులసి పాపని ఇస్తుంది. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్ళమని మినిస్టర్ అనగానే తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోపల దాక్కున్న రుద్రాణి బయటకు వస్తుంది.

Karthika Deepam2 : జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు.. దీప, కార్తీక్ ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -584 లో... దీప, కార్తీక్ డాక్టర్ గదిలో నుండి బయటకు వస్తారు. అప్పుడే జ్యోత్స్నని తీసుకొని దశరథ్, శివన్నారాయణ వస్తు వాళ్ళకి ఎదురుపడతారు. మీరేంటి ఇక్కడ అని శివన్నారాయణ అడుగగా.. దీపకి టెస్ట్ ల కోసమని వచ్చామని కార్తీక్ చెప్తాడు. మరి దీప కోసం అయితే గైనకాలజీస్ట్ ని కలవాలి గానీ డాక్టర్ హారిక గారి గదిలో నుండి వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. అంటే సుమిత్ర అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందామని వచ్చామని దీప అంటుంది.