English | Telugu

Karthika Deepam2 : పుట్టబోయే బిడ్డ కోసం కార్తీక్, దీప ఏం చేయనున్నారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -585 లో.. దీప, కార్తీక్ ల దగ్గరికి దశరథ్ వచ్చి మాట్లాడుతాడు. నీ బిడ్డ.. నా చెల్లి సంతోషం తనని జాగ్రత్తగా కాపాడమని దశరథ్ చెప్తుంటే కార్తీక్ కి ఏడుపు ఆగదు. దశరథ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు స్వప్న అలా విడాకులు ఇస్తానంటే మీరేం అనట్లేదని కాంచన అంటుంది. స్వప్న మొండిది అని కావేరి అంటుంది. అయితే మాత్రం అలా విడాకులు ఇస్తానని అంటుందా‌‌ కావేరి.. వెళ్లి స్వప్నని తీసుకొని రా అని కాంచన చెప్తుంది.

స్వప్న వచ్చి పెద్దమ్మ పిలిచారట అని అంటుంది. నువ్వు కాశీ దగ్గర కావాలని కాంచన అనగానే అది ఎప్పటికి జరగదు పెద్దమ్మ.. కాశీ విశ్వాసం లేని కుక్క అని కాశీని అవమానిస్తుంది స్వప్న. దాంతో కాశీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు జ్యోత్స్న కోపంగా ఇంటికి వస్తుంది. నీకు నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్తున్న విషయం తెలుసు కదా మరి ఎందుకు చెప్పలేదని జ్యోత్స్న అనగానే నాకు అక్కడ ఛాన్స్ ఎక్కడ ఉందని పారిజాతం అంటుంది. కనీసం మెసేజ్ అయినా చెయ్యాలి కదా అని జ్యోత్స్న అనగానే అయ్యో అవును కదా మర్చిపోయానని పారిజాతం అంటుంది.

ఇప్పుడు రిపోర్ట్స్ లో మళ్ళీ మ్యాచ్ కాలేదని తెలిస్తే నేనేం చెయ్యాలని ఆలోచిస్తుంటే.. నువ్వు ఒకదానివి అని జ్యోత్స్న అంటుంది. నీకు దాస్ గురించి తెలుసా అని పారిజాతం మరి మరి అడుగుతుంది. లేదని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు తల్లిని కాపాడుకోవాలా బిడ్డకి జన్మని ఇవ్వాలా అని దీప ఏడుస్తుంటుంది. పుట్టబోయే బిడ్డ గురించి చాలా ఉహించుకున్నానని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య నిజం చెప్తుందేమోనని ప్రేమ టెన్షన్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -386 లో.. రామరాజు హాస్పిటల్ లో ఆ సిచువేషన్ లో ఉంటే భాగ్యం, ఆనందరావు ఇద్దరు భోజనం చేస్తుంటారు. అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఆ విశ్వ గాడు ఏదో మాట్లాడుతా అమూల్యని తీసుకొనిరా అన్నందుకు తీసుకొని వెళ్ళాను కానీ వాడు ఏకంగా పెళ్లి చేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏంటని శ్రీవల్లి కంగారు పడుతుంది. ఏం కాదని భాగ్యం శ్రీవల్లికి టిఫిన్ తినిపిస్తుంటే.. దూరం నుండి నర్మద చూస్తుంది. నర్మద చూసిందని శ్రీవల్లి వెంటనే టేబుల్ కింద దాక్కుంటుంది.

Brahmamudi : మినిస్టర్ ని తక్కువ అంచనా వేసి‌న రాజ్.. చిక్కుల్లోపడ్డ ఫ్యామిలీ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -946 లో.....రాజ్, కావ్య మినిస్టర్ ఇంటికి వెళ్తారు. అక్కడ తులసితో మాట్లాడుతారు. వాళ్ళ ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ చేయమని తన భర్తకి తులసి చెప్తుంది. ఒకసారి పాపని ఎత్తుకుంటానని తులసిని కావ్య అడుగుతుంది. సరే అని తులసి పాపని ఇస్తుంది. పాపని ఎత్తుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది. తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్ళమని మినిస్టర్ అనగానే తులసి పాపని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత మినిస్టర్ కి రాజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. లోపల దాక్కున్న రుద్రాణి బయటకు వస్తుంది.

Karthika Deepam2 : జ్యోత్స్నకి మళ్ళీ టెస్టులు.. దీప, కార్తీక్ ఏడుపు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -584 లో... దీప, కార్తీక్ డాక్టర్ గదిలో నుండి బయటకు వస్తారు. అప్పుడే జ్యోత్స్నని తీసుకొని దశరథ్, శివన్నారాయణ వస్తు వాళ్ళకి ఎదురుపడతారు. మీరేంటి ఇక్కడ అని శివన్నారాయణ అడుగగా.. దీపకి టెస్ట్ ల కోసమని వచ్చామని కార్తీక్ చెప్తాడు. మరి దీప కోసం అయితే గైనకాలజీస్ట్ ని కలవాలి గానీ డాక్టర్ హారిక గారి గదిలో నుండి వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. అంటే సుమిత్ర అమ్మ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుందామని వచ్చామని దీప అంటుంది.