English | Telugu
Podharillu : నిజం చెప్పేస్తానన్న మహా.. తనని చక్రి ఆపగలడా!
Updated : Feb 5, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -43 లో......మహాని రిసెప్షన్ కి రెడీ అవ్వమని చక్రి రిక్వెస్ట్ చేస్తాడు. అయినా తను ఒప్పుకోదు.. నా అలోచనలు నా గోల్స్ వేరే ఉన్నాయి.. నేను ఇప్పుడు నేను రిసెప్షన్ చేసుకుంటే మీకు పర్మినెంట్ గా భార్యని అయినట్లు ప్రపంచానికి తెలిసినట్లు అని మహా అంటుంది. అప్పుడే మాధవ డోర్ కొడుతాడు. మాధవ లోపలికి వచ్చి వాళ్లిద్దరికి బట్టలు ఇచ్చి రెడీ అవ్వమని చెప్తాడు.
నేను మీ కోసం మీ మెడలో తాళి కట్టి భర్తని అనిపించుకున్నాను.. మీరు నాకోసం ఒక గంట.. నాకు భార్యగా స్టేజ్ మీద ఉండలేరా అని చక్రి రిక్వెస్ట్ చేస్తాడు. ఒక ఆడపిల్ల తన భర్తని మాత్రమే భర్త అనుకుటుంది అని మహా అంటుంది. మా వాళ్ళకి నేను అర్ధం అయ్యేలా చెప్తానని చక్రి వెళ్ళిపోతాడు. మరొక వైపు మహా, చక్రి ఇద్దరు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్న వీడియోని తాయారు వాళ్ళకి కేశవ చూపిస్తాడు. దాంతో వాళ్ళు కుళ్ళకుంటారు. రిసెప్షన్ కి అందరు వచ్చి వెయిట్ చేస్తారు. చక్రి టెన్షన్ పడుతాడు. అప్పుడే గాయత్రి వస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదా అని అడుగుతుంది.
మహా రూమ్ లో ఉన్న చక్రి బట్టలు గాయత్రి తీసుకొని వెళ్లి చక్రికి ఇస్తుంది. మళ్ళీ మహా దగ్గరికి ఈ బ్లౌజ్ నేనే కుట్టించి తీసుకొని వచ్చాను.. నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పమని గాయత్రి అనగానే ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్లిపోండి అని మహా అంటుంది. దాంతో గాయత్రి వెళ్ళిపోతుంది. చక్రి సూట్ వేసుకొని మహా దగ్గరికి వస్తాడు. మీరు మీ వాళ్ళకి అసలు విషయం చెప్పలేదని నాకూ అర్థం అయిందని మహా అనగానే మీకెలా తెలుసని చక్రి అడుగుతాడు. మీ అత్త కూతురు రెడీ చేస్తానని వచ్చినప్పుడే అర్థం అయింది. నువ్వు వాళ్లకు ఏం చెప్పలేదని.. నేను ఇప్పుడే వెళ్లి నిజం చెప్తానని మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.