English | Telugu

Brahmamudi: సామంత్ బాడీపై రాజ్ ఫింగర్ ప్రింట్స్.. షాక్ లో దుగ్గిరాల కుటుంబం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -654 లో.....అనామిక తరుపున లాయర్ కావ్యని బోన్ లోకి పిలుస్తాడు. మీరు సామంత్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారా అని అడుగగా.. ఇచ్చామని కావ్య అంటుంది. నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు కదా అని లాయర్ అడుగుతాడు. ఇచ్చామని కావ్య అంటుంది. చూసారా తనే చెప్తుంది.. చంపేస్తామని తన భర్త బెదిరించాడు. అది అందరి ముందు జరగదు కాబట్టి తనే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి చంపాడని అనామిక లాయర్ అటు తిప్పి ఇటు తిప్పి రాజ్ హత్య చేశాడని నిరూపించే ప్రయత్నం చేస్తాడు.

ఆ తర్వాత రాజ్ తరుపున లాయర్ అప్పుని బోన్ లోకి పిలుస్తాడు. మీరు రాజ్ హత్య చెయ్యడం దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా కనిపెట్టారా అని అడుగగా.. లేదు అనామిక కంప్లైంట్ ఇవ్వగానే వెళ్లి సెర్చ్ చేస్తే రాజ్ గారి కార్ లో బాడీ దొరికింది అని అప్పు చెప్తుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నా క్లయింట్ ని హత్య చేసాడనడం కరెక్ట్ కాదు.. కాస్త టైమ్ ఇవ్వండి.. బెయిల్ ఇవ్వండి అని రాజ్ లాయర్ జడ్జ్ ని కోరుతాడు. పేరు పలుకుబడి ఉన్న అతను బయటకు పంపిస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని అనామిక లాయర్ అంటాడు. దాంతో జడ్జ్ రాజ్ బెయిల్ ని రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత రాజ్ ని చూసి అపర్ణ ఎమోషనల్ అవుతుంది. అనామిక వచ్చి మీకు శిక్ష తప్పదంటూ మాట్లాడుతుంది.

కావ్య వాళ్లందరు ఇంటికి వస్తారు. ఇన్ని రోజులు నువ్వు తీసుకునే నిర్ణయాలు సరైనవి అనుకున్న కానీ ఈ రోజు నా కొడుకు విషయంలో తప్పు చేసావ్.. నా కొడుకుకి వ్యతిరేకంగా మాట్లాడావని కావ్యతో అపర్ణ అంటుంది. ఇక దొరికిందే ఛాన్స్ అని ధాన్యలక్ష్మి, రుద్రాణిలు కావ్యపై విరుచుకుపడతారు. దాంతో అందరు తనని ఎందుకు అంటున్నారు. తనకి ఎంత బాధ ఉందో తెలుసా కుటుంబాన్ని ముక్కలు కాకుండా కాపాడింది.. తన భర్త జైలుకు వెళ్తే బాధపడేది తనే.. రాజ్ ని ఎలా కాపాడుకోవాలో ఒక యుద్ధమే చేస్తుందని ఇందిరదేవి అంటుంది. అపర్ణ అర్థం చేసుకొని కావ్యని హగ్ చేసుకొని బాధపడుతుంది. తరువాయి భాగంలో రాజ్ కోసం కావ్య స్టేషన్ కి భోజనం తీసుకొని వెళ్లి రాజ్ కి తినిపిస్తుంది. ఆ తర్వాత సామంత్ బాడీపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ రాజ్ వే అని నిర్ధారణ అయిందని జడ్జ్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.