English | Telugu

'బిగ్ బాస్ ఉత్స‌వం'లో సీమంతం.. హ‌రితేజ భావోద్వేగం!

బుల్లితెర యాంక‌ర్‌, న‌టి హ‌రితేజ భావోద్వేగానికి లోన‌య్యారు. న‌టిగా 'అఆ', 'ప్ర‌తిరోజు పండ‌గే' వంటి చిత్రాలతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హ‌రితేజ బిగ్‌బాస్ సీజ‌న్ 3తో మ‌రింత‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవ‌ల ప్రెగ్నెంట్ అయిన ఆమెకు బిగ్‌బాస్ సీజ‌న్ 3 కంటెస్టెంట్స్ ప్ర‌త్యేకంగా సీమంతం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వివ‌రాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రీ యూనియ‌న్ అంటూ 'బిగ్‌బాస్ ఉత్స‌వం' పేరుతో స్టార్ మా ప్ర‌త్యేకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్లాన్ చేసి ప్ర‌సారం చేస్తోంది. ముందుగా బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్‌ల‌తో ఈ షోని ప్రారంభించిన స్టార్ మా దానికి కొన‌సాగింపుగా 'బిగ్‌బాస్ ఉత్స‌వం 2' అంటూ ఇటీవ‌ల మ‌రో ఎపిసోడ్ ని ప్ర‌సారం చేసింది.

ఇందులో బిగ్‌బాస్ సీజ‌న్ 3కి సంబంధించిన కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. ఆడిపాడి హంగామా చేశారు. అయితే ఇదే షోలో హ‌రితేజ కూడా పాల్గొంది. ఆమె గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో ఇదే స్టేజ్‌పై బిగ్‌బాస్ సీజ‌న్ 3కి సంబంధించిన కంటెస్టెంట్‌లు హ‌రితేజ‌కు సీమంతం చేయ‌డం ఆక‌ట్టుకుంది. త‌ను ఊహించ‌ని స్థాయిలో త‌న‌కు సీమంతం జ‌ర‌గ‌డంతో ఒక్క‌సారిగా హ‌రితేజ భావోద్వేగానికి లోన‌యింది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈ ఆదివారం ప్ర‌సార‌మైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ఆక‌ట్టుకుంటోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.