English | Telugu

అరియానా గ‌య్యాళి వ‌దిన అయిన వేళ‌..!

బిగ్‌బాస్ సీజ‌న్ 4లో ముక్కు అవినాష్‌, అరియానా జోడీకి మంచి మార్కులు ప‌డిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ క‌లిసి స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కామెడీ స్టార్స్‌' షోలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోకు శేఖ‌ర్ మాస్టర్, శ్రీ‌దేవి జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోలో లో గ‌య్యాళి వ‌దిన‌గా అరియానా ఓ రేంజ్‌లో ర‌చ్చ చేసింది.

ఇందుకు సంబంధించిన ప్రోమో సంద‌డి చేస్తోంది. అవినాష్ ఈ షోలో ఓ టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటే, చ‌మ్మ‌క్ చంద్ర మ‌రో టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ షో కోసం ముక్కు అవినాష్‌, అరియానా క‌లిసి స్కిట్ చేశారు. ఇందులో ముక్కు అవినాష్ భ‌ర్త‌గా, అరియానా భార్య‌గా న‌టించారు. భ‌ర్త హోదాలో కాఫీ అడిగితే అరియానా ఏకంగా ముఖంపైనే కొట్టేసింది.

ఇక ముక్కు అవినాష్ త‌మ్ముడిపై వీర లెవెల్లో వీరంగం ఆడింది. అవినాష్ త‌మ్ముడు అమ్మా అని పిల‌వ‌డంతో వీరంగం వేసిన అరియానా అత‌న్ని ఓ ఆట ఆడేసుకుంది. జుట్టుప‌ట్టుకుని ర‌చ్చ చేసింది. తినే తింగ‌డి అవినాష్ ముక్కుకే పోతోందా అని చిందులేసింది.. అంత‌టితో ఆగ‌క అవినాష్ త‌మ్ముడి జుట్టుప‌ట్టుకుని తిండి మొత్తం దీనికే పోతోందారా అంటూ చిందులు తొక్కింది. గ‌య్యాళి వ‌దిన‌గా అరియానా వీరంగం వేసిన 'కామెడీ స్టార్స్' ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌సారం కాబోతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.