English | Telugu

ఆ అమ్మాయితో డేట్ కూడా చేశా...

ఫ్యామిలీ స్టార్ షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇక ఇందులో కండల వీరులే ఎక్కువగా కనిపించారు. బిగ్ బాస్ 7 కి వెళ్లి వచ్చిన గౌతమ్, యావర్, ఆదర్శ్, రమణ వంటి వాళ్ళు వచ్చారు అలాగే ఫుడ్ లవర్స్, ఫుడ్ వ్లాగర్స్ కూడా వచ్చారు..టేస్టీ తేజ, కుమారి ఆంటీ, పంచ్ ప్రసాద్ వంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఐతే గౌతమ్ కృష్ణ తాను ఎందుకు అంత ఫిట్ గా ఉన్నదీ చెప్పుకొచ్చాడు. "నా కాలేజ్ ఏజ్ లో నేను 96 కేజీస్ ఉండేవాడిని. నా కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో నాకు ఒక అమ్మాయి ఇష్టం ఉండేది. ఆమెకు ప్రపోజ్ చేద్దామనుకుని అనుకునేవాడిని కానీ కాన్ఫిడెన్స్ లేక నాలో నేను మధన పడి ఆగిపోయేవాడిని. అలా జరుగుతున్నా టైములో ఒక రోజు నా ఫ్రెండ్ నాకు ఒక విషయం చెప్పాడు.

నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్న విషయం ఆమెకు తెలిసిపోయింది అని. అప్పుడు నేను అడిగాను...ఏమంది మరి ఆ అమ్మాయి అని. ఆ లడ్డుగాడా అని నవ్విన్దిరా అన్నాడు. అప్పుడు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. నన్ను నేను చూసుకున్నా చాలా వెయిట్ ఉన్నా, అంత ఫాట్ ని మోస్తున్నా అని చెప్పేసి వెంటనే వెళ్లి జిమ్ లో జాయిన్ ఇపోయా. అలా ఒక మూడు నాలుగు నెలలు ప్రోపర్ డైట్ తో ఆల్మోస్ట్ 30 కిలోలు తగ్గిపోయా. ఇక కాలేజ్ సెకండ్ ఇయర్ లో ఆ అమ్మాయిని డేట్ కూడా చేశా." అని చెప్పాడు గౌతమ్. ఇక అష్షు రెడ్డి మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడిగింది "ఇప్పుడు ఆ అమ్మాయి లేదు. ఇద్దరికీ సెట్ కాక బ్రేకప్ ఐపోయింది" అని చెప్పాడు. ఇక గౌతమ్ కృష్ణ సోలోబోయ్ మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. గౌతమ్ బిగ్ బాస్ సీజన్ 8 లో రన్నరప్ గా నిలిచాడు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.