English | Telugu

ఇమ్మూ కాదంటే ఊపిరి ఆగిపోతుంద‌న్న వ‌ర్ష‌!

ఖ‌త‌ర్నాక్ కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్`. ఈ షోలో ప్రేమ జంట‌ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ గ‌త కొంత కాలంగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఢీ డ్యాన్స్ షోతో పాటు జ‌బర్ద‌స్త్ కామెడీ షోలోనూ సుడిగాలి సుధీర్, రష్మీ గౌత‌మ్ ల జోడీ ఏ స్థాయిలో పాపుల‌ర్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయిలో మ‌రి కొన్ని జంట‌లు వార్త‌ల్లో నిలుస్తున్నాయి. అందులో ఇమ్మానుయేల్‌, వ‌ర్ష‌ల జంట ముందు వ‌రుస‌లో నిలుస్తోంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య గ‌త కొంత కాలంగా ల‌వ్ ట్రాక్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. వీరి ప్రేమాయ‌ణం కామెడీనా? లేక సీరియ‌స్ గానే వీరు ప్రేమ‌లో వున్నారా? అని చాలా రోజులుగా అంద‌రిలో అనుమానం వుంది.

అయితే తాజాగా ఈ విష‌యంలో ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేద‌ని వ‌ర్ష క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. గ‌తంలో కొన్ని వారాల పాటు జ‌బ‌ర్ద‌స్త్ కు దూరంగా వుంటూ వ‌చ్చిన వ‌ర్ష మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇమ్మానుయేల్ కు దూరంగా వుంటూ వ‌చ్చింది. దీంతో వీరి ల‌వ్ ట్రాక్ బెడిసి కొట్టిందా? అంటూ నెట్టింట ట్రోల్స్ వినిపించాయి. అయితే వాటికి చెక్ పెడుతూ వ‌ర్ష తాజా ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చింది. ఇద్ద‌రి మ‌ధ్య వున్న ప్రేమ‌ని మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది. ఇమ్మానుయేల్ లేక‌పోతే తాను బ‌త‌క లేన‌ని చెప్పేసి షాకిచ్చింది.

తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. కెవ్వు కార్తీక్ మ్యాన్ హోల్ లో ప‌డిపోవ‌డం.. న‌వ్వులు పూయిస్తోంది. య‌మ ధ‌ర్మ‌రాజు గెట‌ప్ లో గెట‌ప్ శ్రీ‌ను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మ‌ళ్లీ తిరిగొచ్చిన గెట‌ప్ శ్రీ‌ను ..ఆటో రాంప్ర‌సాద్ తో క‌లిసి జ‌బ‌ర్ద‌స్త్ ను మ‌ళ్లీ గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే `య‌మ‌లోకం` స్కిట్ ని ప్ర‌ద‌ర్శించారు. ఈ స్కిట్ లోనే వ‌ర్ష ఎమోష‌న‌ల్ అవుతూ ఇమ్మానుయేల్ లేక‌పోతే, త‌ను కాదంటే నా ఊపిరి ఆగిపోతుంది అంటూ షాకిచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.