English | Telugu

బుల్లెట్ భాస్క‌ర్ ని కుక్క‌ని కొట్టిన‌ట్టు కొట్టారా?

బుల్లితెర హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొన్నేళ్లుగా అల‌రిస్తూ ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. ఈ షోకు ఇంద్ర‌జ‌తో పాటు కొత్త‌గా లైలా కూడా న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక ఈ షోకు యాంక‌ర్ గా ర‌ష్మీ గౌత‌మ్ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక ఈ షోలో ఆటో రామ్ ప్ర‌సాద్‌, రాకెట్ రాఘ‌వ‌, చలాకీ చంటి, తాగుబోతు ర‌మేష్‌, రైజింగ్ రాజు, బుల్లెట్ భాస్క‌ర్‌, వ‌ర్ష‌, ఇమ్మానుయేల్, ఫైమా, రోహిణి త‌దితరులుటీమ్ లీడ‌ర్ లుగా వ్య‌వహ‌రిస్తున్నారు.

ఈ నెల 24న ప్ర‌సారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని మల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ వారు విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలో ఆటో రాం ప్ర‌సాద్ డూప్లికేట్ హీరోల‌తో హంగామా చేయించాడు. ఆ త‌రువాత వ‌ర్ష అంద‌రి ముందే ఇమ్మానుయేల్ కు ప్ర‌పోజ్ చేసి షాకిచ్చింది. అయితే వున్న‌ట్టుండి వ‌ర్ష ఇలా ప్ర‌పోజ్ చేయ‌డంతో ఇమ్మానుయేల్ షాక్ లో వుండిపోయాడు. ఇది క‌లా.. స్కిట్టా ఏదీ అర్థం కాని అయోమ‌యంలో వుండిపోయాడు.

ఇదిలా వుంటే బుల్లెట్ భాస్క‌ర్ ని లేడీస్ స్టేజ్ పైనే విగ్గు పీకి మ‌రీ కుక్క‌ని కొట్టి న‌ట్టు కొట్టారు. `ఠాగూర్` లోని యాంటీ క‌రప్ష‌న్ ఫోర్స్ సీన్ ని బుల్లెట్ భాస్క‌ర్ యాంటీ భార్య ఫోర్స్ గా రీక్రియేట్ చేశాడు. ఇందు కోసం లేడీ టీమ్ లీడ‌ర్ల‌ని అంద‌రిని రాడ్ ల‌కు క‌ట్టేసి ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టాడు. రోహిణి ద‌గ్గ‌రి కి వ‌చ్చి మీ పేరు అని అడిగాడు.. గ‌జ‌ల‌క్ష్మి అని చెప్పింది. ఇంత‌కు ముందు నీ వెయిట్ ఎంత అంటే 35 అంది..ఇప్పుడెంత అంటే 95 అనేసింది. హైద‌రాబాద్ లో గ‌జం రేటు పెరుగుతున్నంత టైప్ లో పెంచేశావ్ అని పంచ్ వేశాడు. ఈ లోపు బుల్లెట్ భాస్క‌ర్ కు భార్య‌ని అంటూ ఓ కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్క‌డ న‌లుగురు అమ్మాయిల‌ని క‌ట్టేశావా? అంటూ బుల్లెట్ భాస్క‌ర్ చంక‌నెక్కేసి అత‌ని విగ్గు పీకేసి లెంప‌లు వాయించేసింది.. ఒక విధంగా చెప్పాలంటే అత‌న్ని కుక్క‌ని కొట్టిన‌ట్టు కొట్టింది. దీంతో రంగంలోకి దిగిన ఇమ్మానుయేల్ .. బుల్లెట్ భాస్క‌ర్ త‌రుపున ఇంద్ర‌జ‌, లైలాల‌ను నిల‌దీయ‌డం న‌వ్వులు పూయిస్తోంది.