English | Telugu

భరణిని అన్నయ్య అని పిలవడానికి అసలు కారణం చెప్పిన దివ్య తల్లి... ఫుల్ ఎనర్జీతో నిండిన హౌస్!

బిగ్ బాస్ సీజన్-9 లో పన్నెండవ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇందులో భాగంగా మొదటగా హౌస్ లోకి డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా సెకెండ్ సంజన ఫ్యామిలీ వచ్చారు. ఇక చివరగా దివ్య వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

దివ్య వాళ్ళ అమ్మ హౌస్ లోకి రాగానే హౌస్ అంతా పవర్ హౌస్ లా‌ మారిపోయింది. కంటెస్టెంట్స్ అంతా ఫుల్ జోష్ తో నిండిపోయారు. అందరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఏవైనా టిప్స్ ఇస్తారు.. ఎమోషనల్ అవుతారు కానీ దివ్య వాళ్ళ అమ్మ అయితే అందరితో సరదాగా మాట్లాడింది. ఫుల్ ఫన్ అండ్ ఎనర్జీ హౌస్ మేట్స్ కి ఇచ్చింది దివ్య వాళ్ళ అమ్మ శ్రీలక్ష్మీ. ఇక అందరిని లివింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి చేతిలో కాఫీ కప్పు పట్టుకొని సరదాగా మంచి విషయాలు మాట్లాడింది. ఒక మనిషి ఎప్పుడూ తన క్యారెక్టర్ మార్చుకోలేడు.. అలా మార్చుకుంటే అది టెంపరెరీయే.. అది మార్చుకోవద్దు.. ఒరిజినల్ ఒరిజినల్‌గా అలానే ఉంచండి.. ఎవరైనా వస్తారు.. ఏదో చెప్తారు.. అవన్నీ ఆలోచిస్తే మీకు ముుందుకెళ్లాలో తెలీదు వెనక్కి రావాలో తెలీదు.. ఆ ఇన్‌పుట్స్ ఏం వద్దు అసలు.. మీరు ఎలా ఉన్నారో అలా ముందుకెళ్లిపోండి.. మీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుందంటూ అందరికి సలహా ఇచ్చింది.

నాకు ఒక బ్రదర్ ఉన్నాడు.. తను ఈ ఒత్తిడి తట్టుకోలేక చదువులో అందరూ ముందుకెళ్లిపోతున్నారు నేను వెళ్లలేకపోతున్నానని చెప్పి ఇరవై అయిదేళ్ల ఏళ్ల క్రితం తను ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నాది కూడా చిన్న వయసే.. అప్పుడే పెళ్లయిన కొత్త.. ఆ ట్రోమా నాకు అలానే ఉండిపోయింది.. ఎందుకంటే నా అన్నయ్య నాతో పాటు కలిసి తిరిగాడు.. మా అన్నయ్య ఎప్పుడు చూసినా నాకు గుర్తొస్తూనే ఉండేవాడు.. ఇప్పటికి కూడా అంతే.. అయితే నేను టీవీలో ఒక పర్సన్‌ని చూశా.. ఆ ఒక్క వ్యక్తే నాకు నిజంగా అన్నయ్యలా అనిపించాడు అతనే భరణి గారు.. నేను దివ్యకి చెప్పా.. నిజంగా చెప్పాలంటే ఒక్క అన్నయ్య ఫీలింగ్ కావాలంటే ఇతను ఒక్కడిలో ఉన్నాయి.. అంటే నాకు బ్రదర్ అయ్యే ఫీలింగ్.. ఆయన సినిమాలు, సీరియల్స్ చేస్తారని నాకు అంతగా తెలీదు.. నేను దివ్యతో చెప్పా అప్పుడు.. నువ్వు ఏమైనా మాట్లాడాలంటే నాకు బ్రదర్ ఫీలింగ్ ఉంది.. నువ్వు నా బ్రదర్‌ని మామా మామా అని పిలవలేవు కదా లోపలికెళ్లి అందుకే నువ్వు బ్రదర్ అని పిలిస్తే నేను బ్రదర్ అని పిలిచినట్లు ఫీలింగ్.. నువ్వు అట్లనే భరణి గారిని అన్నయ్య అని పిలిచి నా కోరిక తీర్చమని చెప్పానంటూ శ్రీలక్ష్మి ఎమోషనల్ అయ్యింది. అందుకే హౌస్ లో దివ్య బ్రదర్ అని ఎవరినైనా అందా.. తను భరణి గారిని బ్రదర్ అని పిలవడానికి రీజన్ అదే..నేను చెప్పిన ప్రకారమే పిలిచింది.. నేను ఏం చెప్తే అది ఫాలో అయిందంటూ దివ్య తల్లి చెప్పుకొచ్చింది. దీంతో అందరు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత హౌస్ లోని ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసి చూపించింది శ్రీలక్ష్మి. అదంతా ఫుల్ ఫన్ గా సాగింది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.