English | Telugu

ముద్దులు, హగ్గుల కోసం అరుచుకున్న ఆది, రవికృష్ణ!

ఢీ 14 కలర్స్ స్పెషల్ ప్రోమో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఐతే ఈ ఎపిసోడ్ లో ముద్దుల గురించి హగ్గుల గురించి గొడవ పడతారు ఆది, రవికృష్ణ. శ్రద్ధ దాస్ ఆదిని తన సీట్ దగ్గరకు పిలుస్తుంది. ఇంతలో వెనకనే ఆది వైఫ్ గా తేజు వచ్చి ఎం జరుగుతుంది నీకు శ్రద్ధకి మధ్య అని అడుగుతుంది. ఢీ 14 జరుగుతుంది అంటాడు ఆది. మా ఇద్దరి మధ్య చిన్న డీల్ జరుగుతోంది కానీ నువ్వెళ్లు అంటాడు తేజుని. మై నై జావుంగి అంటుంది. వెంటనే శ్రద్ద వచ్చి కిస్ కాదు హగ్ ఇస్తాను అంటుంది. ఏదో వకటిరా త్వరగా ఇవ్వు , టైం లేదు అంటాడు ఆది తొందరపడుతూ.

ఈ ముద్దులు, హగ్గులు తతంగమంతా చూస్తూ రవికృష్ణ లేచొచ్చి గట్టిగా అరుస్తూ అడ్డుపడతాడు. ఆదికి కోపం వచ్చేసి మా ఇద్దరి మధ్యకి ఎవరన్నా అడ్డొస్తే ఈరోజు శవాలు లేస్తాయి అంటూ వార్నింగ్ ఇస్తాడు.

ఏ విషయంలో ఐనా గొడవ పెట్టుకోండి ఈ విషయంలో నా జోలికి రావద్దు అంటాడు రవికృష్ణతో ఆది. రవికృష్ణ వచ్చి ముందు హగ్ నాకు ఇచ్చేయండి శ్రద్ద గారు నేను ఆది కి పాస్ చేస్తా అనేసరికి నవ్య స్వామి ఎంట్రీ ఇచ్చి హలో ఏమిటి రవి నువ్వు ఇలా తయారయ్యావ్ అంటుంది. అసలు నువ్వెలా ఉన్నావో చూసుకో ముందు అని నవ్యని తిడతాడు ఆది. వెంటనే తేజు వైపు చూసి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నీ మీదే శ్రద్ద పెడతా వన్స్ ఈ స్టేజి మీద ఉన్నానంటే శ్రద్ద దాస్ మీదే పెడతా అంటాడు ఆది. ఎవడిక్కాలి నీ బోడి శ్రద్ద అంటుంది సీరియస్ గా తేజు. అవును ఎవడిక్కాలి నాకు అవసరం లేదు పో అంటూ అరుస్తాడు తేజు మీద.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.