English | Telugu
Brahmamudi : ట్యాబ్లెట్స్ మార్చేసిన రుద్రాణి.. కావ్యని పెళ్ళి చేసుకుంటానన్న రాజ్!
Updated : Aug 17, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -802 లో...... కావ్య రెడీ అయి పై నుండి కిందకి వస్తుంది. తనని చూసి రాజ్ ప్లాట్ అవుతాడు. మీరు చాలా బాగున్నారని రాజ్ అనగానే ఏంటి రాజ్ మా కావ్యకి అందరి ముందే సైట్ కొడుతున్నావని స్వప్న అంటుంది. ఆ తర్వాత రాజ్ అందరిని ఒక్కొక్కరిగా హాల్లో నుండి పంపిస్తాడు. మీరు బాగున్నారని మళ్ళీ అంటాడు. ఇందాకే చెప్పారు కదా అని కావ్య అనగానే అందరి ముందు చెప్పాను కానీ ఇప్పుడు పర్సనల్ గా చెప్తున్నానని రాజ్ అంటాడు.
ఆ తర్వాత కావ్య దగ్గరికి అప్పు వచ్చి.. నా టాబ్లెట్స్ అయిపోయాయి. నీ దగ్గరివి ఇవ్వు అక్క అని అప్పు అడుగుతుంది. ఎవరైనా వింటారు మెల్లిగా అని కావ్య అంటుంది. అప్పు ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్ళిపోగానే.. అప్పుడే కనకం వస్తుంది. నిన్ను చూస్తుంటే బాధగా ఉందని అంటుంది. అది రుద్రాణి విని ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్లి అప్పు ప్రెగ్నెంట్ అని కావ్యకి ఈర్ష్యగా ఉందంటే నమ్మలేదు కదా కావ్య మాటలు విను అని కావ్య, కనకం మాట్లాడుకునే దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అప్పు చాలా అదృష్టవంతురాలు అర్థం చేసుకునే భర్త ఉన్నాడని కనకంతో కావ్య అంటుంది. అదంతా ధాన్యలక్ష్మి వింటుంది. చూసావా అది ఈర్ష్య కదా అని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. ఆ తర్వాత రాజ్, స్వరాజ్ కి కళ్యాణ్ బట్టలు తీసుకొని వచ్చి ఇస్తాడు. ఆ తర్వాత అప్పు నువ్వు టిఫిన్ చెయ్ అంటుంది. ధాన్యలక్ష్మి స్వయంగా అప్పుకి టిఫిన్ పెడుతుంది.
టాబ్లెట్స్ ఎక్కడున్నాయని అప్పుని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నా రూమ్ లో ఉన్నాయని అప్పు చెప్తుంది. అదంతా విన్న రుద్రాణి.. నువ్వు వెళ్లి ఆ ఒరిజినల్ టాబ్లెట్ ప్లేస్ లో ఇవి పెట్టమని రాహుల్ కి వేరే టాబ్లెట్స్ ఇస్తుంది. ధాన్యలక్ష్మి గదిలోకి వెళ్ళేలోపు రాహుల్ టాబ్లెట్స్ చేంజ్ చేసి వస్తాడు.ఆ తర్వాత రాజ్ పంచెకట్టులో పూజ దగ్గరికి వస్తాడు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు కలిసి పూజకి ఏర్పాట్లు చేస్తారు. తరువాయి భాగంలో కావ్యని రాజ్ ఆశీర్వదించేలా కనకం చేస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కావ్యతో అంటాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.