English | Telugu

నాకు అలా ఎవ‌రైనా చూపిస్తే క‌ట్ చేసి పారేస్తా!

ఆర్జే కాజల్ మీద యాంకర్ రవికి ఒక రేంజ్‌లో కోపం వచ్చింది. కానీ, కంట్రోల్ చేసుకున్నాడు. బహుశా... కోప్పడితే మహిళా ప్రేక్షకులకు దూరం అవుతానని అనుకున్నాడేమో! గతంలో లహరి, ప్రియ ఇష్యూలో తాను అన్న మాటలను అనలేదని అనడం, తర్వాత నాగార్జున ఆధారాలతో సహా చూపించడంతో చాలా బ్యాడ్ అయ్యాడు. అందుకు క్షమాపణలు కోరాడనుకోండి. ఇక, లేటెస్ట్ ఇష్యూకు వస్తే...

'బిగ్‌బాస్ 5' మంగళవారం ఎపిసోడ్‌లో రవి, లోబో దగ్గరకు వచ్చి 'ఈ రోజు డిన్నర్‌కు ఏం చేస్తున్నారు?' అని కాజల్ అడిగింది. వాళ్లు ఏదో చెప్పబోతుండగా... "నిన్న గొడవ జరిగింది దేనికంటే? రవి, లోబో వాష్‌రూమ్ నుండి డిన్న‌ర్‌కు రావ‌డానికి" అంటూ ఆట పట్టించాలని అనుకుంది. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇన్‌డైరెక్ట్‌గా కాజ‌ల్‌కు లోబో మిడిల్ ఫింగ‌ర్ చూపించాడు. ఆ విషయం కాజల్ ఇతర సభ్యులతో చెప్పగా 'నాకు అలా ఎవరైనా చూపిస్తే కట్ చేసి పారేస్తా' అని ప్రియాంక చెప్పింది. ఈలోపు రవి, లోబో అక్కడికి వచ్చారు.

'నేను సరదాగా అన్నాను' అని కాజల్ సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నించింది. 'నీకు సరదా ఏమో! అవతలి వ్యక్తికి కాదు. అది తెలుసుకోకుండా ఎలా వస్తారు? నా నోటి నుండి తప్పుడు మాటలు వస్తాయేమో అని కంట్రోల్ చేసుకున్నా' అని రవి సీరియస్ అయ్యాడు. తర్వాత కాజల్, రవి మధ్య మాట మాట పెరిగి ఒకరి మీద మరొకరు అరుచుకున్నారు. లోబో మిడిల్ ఫింగర్ చూపించడం ప్రాబ్లమ్ కాదా? అని రవిని కాజల్ ప్రశ్నించింది. దీన్ని శ్రీరామచంద్ర పరిష్కరించడానికి ప్రయత్నించాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.