English | Telugu

Bigg Boss 9 Telugu TRP : బిగ్ బాస్ సీజన్-9 టీఆర్పీ గోవింద.. ఆ సీరియల్ వల్లేనా!

బిగ్ బాస్ సీజన్-9 పన్నెండు వారాలు పూర్తయింది. పదమూడో వారం టికెట్ టు ఫినాలే టాస్క్ లు సాగుతున్నాయి. హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా వారిలో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక వీరిలో తనూజ టాప్ లో ఉండగా సుమన్ శెట్టి, డీమాన్ పవన్ డేంజర్ జోన్ లో ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు టీఆర్పీ గత ఎనిమిది సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ ఎక్కువగా ఉంది.

దువ్వాడ మాధురి, పచ్చళ్ళ పాప రమ్య మోక్ష రావడంతో టీఆర్పీ అమాంతం పెరిగింది. ఇక సుమన్ శెట్టి, పవన్ కళ్యాణ్ పడాల మిలటరీ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి మరింతగా ఆడియన్స్ కి దగ్గరైంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సగటుగా 8.4 TVR ఉంటే వీకెండ్లో 13.4 TVR నమోదవుతుందట. ఇలా ఇప్పటివరకు మొత్తం సీజన్ లో 11.2 TVR వచ్చినట్టు తెలుస్తోంది. ఇది తెలుగు టెలివిజన్ చరిత్రలోనే రికార్డు. వాస్తవానికి రియాలిటీ షోలలో సాధారణంగా మధ్య సీజన్లో TRP పడిపోతుంటుంది. కానీ, ఈసారి సీజన్ 9 ఫ్యామిలీ వీక్ టర్నింగ్ పాయింట్ గా మారింది. బిగ్ బాస్ సీజన్-9 రేటింగ్ ఫ్యామిలీ వీక్ నుండి పెరుగుతూ వస్తోంది. అయితే బిగ్ బాస్ సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మొదలవుతుంది. ఇక ఈ నెల ఎనిమిది (డిసెంబర్ 8) నుండి ఈ టైమ్ స్లాట్ లో కొత్త సీరియల్ రాబోతుంది.

స్టార్ మా టీవీలో గత కొన్ని వారాలుగా 'పొదరిల్లు' అనే సీరియల్ ప్రోమోని రిపీట్ గా కాదు.. రీ..రీపీట్ గా వేస్తున్నారు. మరి ఈ సీరియల్ ని బిగ్ బాస్ టైమ్ స్లాట్ లో వేస్తే.. బిగ్ బాస్ ని పదిగంటలకి టెలికాస్ట్ చేస్తారన్నమాట. అంటే బిగ్ బాస్ పూర్తయ్యేసరికి పదకొండు అవుతుంది. అసలే చలికాలం.. తొమ్మిదిన్నరకి మొదలవుతేనే ఇంత టీఆర్పీ వస్తుంది. అదే పదింటికి మొదలవుతే టీఆర్పీ అమాంతం పడిపోతుంది. ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందని ఆడియన్స్ భావిస్తుంటే ఇలా టైమ్ స్లాట్ కూడా మారిస్తే బిగ్ బాస్ సీజన్-9 టీఆర్పీ ఢమాల్ అవుతుందనేది వాస్తవం. మరి బిబి టీమ్ ఈ విషయంలో ఏం అయినా ఆలోచిస్తారా లేక అదే టైమ్ కి పొదరిల్లు అనే సీరియల్ ని టెలికాస్ట్ చేస్తారా చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.