English | Telugu
Bigg Boss 9 Nominations: ఏడో వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే!
Updated : Oct 21, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో ఏడో వారం నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో కొన్ని ట్విస్ట్ లు ఇచ్చాడు బిగ్ బాస్. మొదటగా హౌస్ లో ఉన్న ఇద్దరు కెప్టెన్స్ కి ఓ పరీక్ష పెట్టాడు బిగ్ బాస్.
గార్డెన్ ఏరియాలో బ్లూ పిల్, రెడ్ పిల్ ఉంచారు. వారిలో ఎవరు ఏ పిల్ తీసుకుంటారో డిసైడ్ చేసుకోమన్నాడు బిగ్ బాస్. సుమన్ శెట్టి రెడ్ పిల్, గౌరవ్ బ్లూ పిల్ తీసుకుంటాడు. అయితే బ్లూ పిల్ లో సేవ్ అదర్స్ , రెడ్ పిల్ లో సేవ్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. ఇక సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయ్యాడు. గౌరవ్ తన పవర్ ని ఎవరికి వాడాడో చూసేద్దాం. మొదటగా రీతూని అయేషా డైరెక్ట్ నామినేషన్ చేసింది. ఆ తర్వాత అయేషా, శ్రీనివాస్ సాయిని దివ్య నిఖిత నామినేషన్ చేసింది. రీతూ చౌదరి రాముని కూడా నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య కూడా గొడవ పీక్స్ లో జరిగింది. రాము హౌస్ లో అసలు కనిపించడం లేదు, అతడు ఫేక్ అంటూ రీతూ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత తనూజని రమ్య మోక్ష నామినేట్ చేసింది. తనూజ సొంతంగా గేమ్ ఆడలేదు. తనూజ ఫేక్, ఆమె నటిస్తోంది. ఆమె చేసేది మొత్తం నటనే అనగా ఎవరేంటో హోస్ట్ సర్ చూపించారు.. నీలా బ్యాక్ బిచ్చింగ్ నేను చేయనంటూ తనూజ ఫైర్ అయింది. వీరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.
ఆ తర్వాత సంజనని కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ హర్ట్ అయ్యాడు. తనూజని నామినేట్ చేస్తానంటేనే నీకు చీటి ఇచ్చాను కళ్యాణ్ అని ఇమ్మాన్యుయల్ అన్నాడు. కానీ తనపై నామినేషన్ అయిపోయిందని కళ్యాణ్ అన్నాడు. ఎవరో చెప్పడం వేరు.. కళ్యాణ్ అనేవాడు చెప్పడం వేరు.. నువ్వు తనని నామినేట్ చేస్తానంటేనే నీకు చీటి ఇచ్చాను.. ఐ డిడ్ ఏ మిస్టేక్.. రేపు సంజన ఎలిమినేషన్ అవుతే నా తప్పు అవుతుంది. నీకు ఇవ్వడం నేను చేసిన తప్పు అవుతదని ఇమ్మాన్యుయల్ ఫీల్ అయ్యాడు. ఇక నామినేషన్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేసే పవర్ గౌరవ్ కి ఇచ్చాడు బిగ్ బాస్. అయేషాని సేవ్ చేస్తున్నట్లు గౌరవ్ చెప్పాడు. రీతూ చౌదరి, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్ పడాల, సంజన గల్రానీ, దివ్య నిఖిత వెలమూరు ఈ వారం నామినేషన్లో ఉన్నారు.