English | Telugu

Karthika Deepam2 : దాస్ ని కిడ్నాప్ చేసింది జ్యోత్స్నే.. కనిపెట్టేసిన పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -581 లో...... కార్తీక్ చెప్పినట్టుగా జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్తుంది. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి.. నా కొడుకు కన్పించడం లేదని కంప్లైంట్ ఇవ్వడానికి అని పారిజాతం అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. కార్తీక్ చెప్పామన్నట్లు చెప్పినా వాడు చెప్పినట్టు దీని మొహంలో రంగులు మారుతున్నాయని పారిజాతం అనుకుంటుంది. గుమ్మం దగ్గర తయాత్తు కనిపించడం చూస్తే వాడిని ఎవరో కిడ్నాప్ చేశారని అనిపిస్తుంది అందుకే అని పారిజాతం అనగానే జ్యోత్స్న మొహంలో భయం కనపడుతుంది. ఎవరు కిడ్నాప్ చేశారంటే ఏమని సమాధానం చెప్తావని జ్యోత్స్న అనగానే నువ్వే చేసావని చెప్తాను.. మరేంటి అన్ని ప్రశ్నలు అని పారిజాతం కోప్పడుతుంది.

నువ్వు ఏదైనా చేసుకో గ్రానీ.. నేను అయితే రాను నేను ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు వాళ్లెవరు సాయం చెయ్యలేదని జ్యోత్స్న అంటుంది. అంటే ఇప్పుడు దాస్ ప్రాబ్లమ్ లో ఉన్నాడా అని పారిజాతం అడుగుతుంది. నేను నా గురించి చెప్తున్నానని జ్యోత్స్న మాట దాటేస్తుంది. మరొక వైపు కాంచన, కాశీ గురించి మాట్లాడానికి శ్రీధర్ ని ఇంటికి పిలుస్తుంది. కాశీ తప్పు చేసాడు. వాడికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని కాంచన అనగానే మంచి మాట మాట్లాడావ్.. మరి నువ్వు నాకు ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదని శ్రీధర్ అడుగుతాడు. దాంతో కాంచన సైలెంట్ గా ఉంటుంది. మరొకవైపు కార్తీక్ దగ్గరికి పారిజాతం వస్తుంది.

ఒరేయ్ నువ్వు చెప్పినట్లు చెప్పాను నిజంగానే అది భయపడినట్లు అనిపించిందని పారిజాతం చెప్తుంది. కదా అందుకే నీ మనవరాలు ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్ళిందని మొత్తం గమనించమని చెప్తాడు. మరొకవైపు శ్రీధర్ అన్న దానికి కాంచన సమాధానం చెప్పడం లేదు.. అప్పుడే కార్తీక్, దీప ఎంట్రీ ఇస్తారు. కాశీ ఎప్పుడు వచ్చాడని దీప అడుగుతుంది. మీ అత్తగారు కాశీ విషయంలో ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పు అని అంటుంది కాంచన. అదే నా విషయంలో ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదని అంటున్నానని శ్రీధర్ అంటాడు. ఒరేయ్ కార్తీక్ నువ్వు అయినా చెప్పమని శ్రీధర్ అనగానే మీ కొడుకుగా మీరు కలిసి ఉండాలనే అనుకుంటాను.. మీరు మాట్లాడుకొండి అని కార్తీక్ అంటాడు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మార్పు ఉండదని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi : మినిస్టర్ ఇంటికి రాజ్, కావ్య.. తమ పాపని దక్కించుకుంటారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -942 లో...... కావ్య తన బిడ్డ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో డాక్టర్ హెల్ప్ చేస్తుంది. డెలివరీ అయిన లిస్ట్ లో మినిస్టర్ భార్య తులసి ఉందని చెప్తుంది. ఈ కేసు డీల్ చేసింది డాక్టర్ చక్రవర్తి.  ఆయన రావడం లేదు. తనకి అసిస్టెంట్ గా  నీలవేణి నర్సు ఉందని కావ్యతో చెప్తుంది డాక్టర్ అనురాధ. మరొకవైపు నర్సు నీలవేణి ఇంకొక సిస్టర్ మాట్లాడుకుంటారు. ఈ గోల్డ్ చైన్ తీసుకున్నానని నర్సు అనగానే నేను చూడు పది లక్షలు పెట్టి తీసుకున్నానని నీలవేణి నర్సు అంటుంది.