English | Telugu

బాల‌య్య డైలాగ్‌కి మ‌హేష్ పంచ్ అదిరిందిగా!

నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో దేశవ్యాప్తంగా టాక్ షోల‌లో టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుని ఐఎండీబీలో 9.8 రేటింగ్ ని ద‌క్కించుకున్న ఏకైక టాక్ షోగా రికార్డుని సాధించింది. గ‌త కొన్ని వారాలుగా టాలీవుడ్ సెల‌బ్రిటీలని షోకు గెస్ట్ లుగా ఆహ్వానిస్తూ త‌న‌దైన స్టైల్లో ఇంట‌ర్వ్యూలు చేస్తున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌.

ముందు బాల‌కృష్ణ హోస్ట్ అన‌గానే ఈ టాక్ షో పై భిన్న స్వ‌రాలు వినిపించాయి. అయితే వాట‌న్నింటికీ షాకిస్తూ బాల‌కృష్ణ త‌న‌దైన స్టైల్లో గెస్ట్ ల‌తో స‌ర‌దా సంభాష‌ణ‌ల‌తో వారిని ఎంట‌ర్‌టైన్ చేస్తూ షోని ర‌క్తిక‌ట్టించారు. ఈ షో తాజా సీజ‌న్ ఫైన‌ల్ ఎపిసోడ్ ఫిబ్ర‌వ‌రి 4న స్ట్రీమింగ్ కాబోతోంది. దీంతో ఈ షో ముగియ‌బోతోంది. ఈ ఫైన‌ల్ ఎపిసోడ్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ని ప్ర‌క‌టించేసిన ఆహా మేక‌ర్స్ తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు.

Also Read: న‌టుడు కొంచాడ శ్రీ‌నివాస్ మృతి

బాల‌కృష్ణ ఆడియ‌న్స్ మ‌ధ్య‌లో కూర్చుని మ‌హేష్ ని ఆహ్వానించ‌డంతో ప్రోమో మొద‌లైంది. అస‌లు మ‌హేష్ ఎవ‌రంటే `నా పిల్ల‌ల‌కి నేను తండ్రిని' అని మ‌హేష్ చెప్ప‌డం... 'ఇద్ద‌రిలో ఎవ‌రు క్యాటు.. ఎవ‌రు బ్రాటు' అని బాల‌య్య ప్ర‌శ్నిస్తే `గౌత‌మ్ క్యాట్ అని సితార బ్రాట్' అని... తాట తీసేస్త‌ద‌ని మ‌హేష్ చెప్ప‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఇక 'మీ నాన్న‌గారు ఫుల్లు సెటైర్లు.. మ‌రి నువ్వు కూడా... సెటైర్ల‌కి బాప్ అని విన్నానే'.. అన‌గానే మ‌హేష్ .. 'నాదుంట‌దండి.. నా టైమింగ్ వుంట‌దిగా'.. అని చెబుతుంటే `వ‌స్త‌దిగా'...అని బాల‌య్య అన‌డంతో అంతా న‌వ్వేశారు.

ఇక 'న‌మ్ర‌త గారి గురించి చాలా బాగా చెప్పావ్‌.. త‌ను కొన్ని స్టేట్‌మెంట్స్ ఇచ్చింది' అని బాల‌య్య అన‌గానే.. 'ఏం స్టేట్‌మెంట్ ఇచ్చింది... మంచి స్టేట్‌మెంటే ఇచ్చివుంట‌ద‌'ని మ‌హేష్ చెప్ప‌డం.. 'ఏంటీ న‌మ్ర‌త అన‌గానే డిసిప్లేన్‌ వ‌చ్చేసింది బాడీలో' అని బాల‌య్య అన‌డం.. 'ఇప్పుడు ఇంటికి వెళ్లాలి సార్.. ఇప్పుడు ఎందుకండీ ఇవ‌న్నీ'.. అని మ‌హేష్ అన‌డంతో బాల‌య్య పెద్ద‌గా న‌వ్వేశారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ గురించి అడిగే స‌రికి మ‌హేష్ ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న గురించి చెప్పాడు.

Also Read:వ‌రుణ్‌తేజ్‌తో పెళ్లి వ‌దంతులు.. ఫొటోతో ఆన్స‌ర్ ఇచ్చిన లావ‌ణ్య‌!

ఒక రౌండ్ ఫుల్ గా అయిపోయి ఎండ్ కి వ‌చ్చేస‌రికి ఏదో తిరుగుతుంది అక్క‌డ‌... ఏంట‌ని ద‌గ్గ‌రికి వెళ్ల‌గానే పాము ప‌డ‌గ విప్పింది... వెంట‌నే రివ‌ర్స్ ఐదు కిలోమీట‌ర్లు ప‌రుగెత్తి గేటు నుంచి బ‌య‌టికి వెళ్లి మ‌ళ్లీ కేబీఆర్ పార్క్ ద‌రిదాపుల్లోకి కూడా వెళ్ల‌లేద‌ని మ‌హేష్ చెప్ప‌డంతో న‌వ్వులు విరిసాయి. ప్రోమోనే ఇలా వుంటే ఎపిసోడ్ ఏ రేంజ్ లో వుంటుందో ఊహించుకోవ‌చ్చు. ప్రోమో చివ‌ర్లో బాల‌య్య దేవుడి గురించి డైలాగ్ చెప్ప‌డం.. దానికి `ఏమ్మా దేవుడిని ఎవ‌రైనా చూస్తారా?` అని మ‌హేష్ పంచ్ వేయ‌డం అదిరింది. ప్ర‌స్తుతం ఈ ప్రోమో నెట్టింట వైర‌ల్ గా మారింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.