English | Telugu

'జ‌బ‌ర్ద‌స్త్‌'ను బీట్ చేసిన‌ 'కామెడీ స్టార్స్‌'!

ఈటీవీ ఛాన‌ల్‌లో మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్రారంభ‌మైన 'జ‌బ‌ర్ద‌స్త్‌' కామెడీ షోని ఏ కార్య‌క్ర‌మం బీట్ చేయ‌లేక‌పోయింది. జ‌నాల్లో కామెడీ షో అంటే 'జ‌బ‌ర్ద‌స్త్‌' అనేంత‌గా పాపులారిటీని ఈ షో ద‌క్కించుకుంది. దీంతో నిర్వాహ‌కుల‌తో పాటు వీక్ష‌కులూ ఈ షోని కొట్టేది మ‌రోటి లేద‌ని, రాద‌ని ఫిక్స‌యిపోయారు.

ఈ షోని బీట్ చేయాల‌ని చాలా మంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసి ఫ్లాప‌య్యారు. కానీ తాజాగా ఈ షోని స్టార్ మాలో కొత్త‌గా ప్రారంభ‌మైన 'కామెడీ స్టార్స్‌' షో బీట్ చేసి దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ వ్యాఖ్యాత‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌, శ్రీ‌దేవి న్యాయ‌నిర్ణేత‌లుగా ప్రారంభ‌మైన ఈ షో హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

ముక్కు అవినాష్‌, అరియానా, చ‌మ్మ‌క్ చంద్ర అండ్ టీమ్ పాల్గొంటున్న ఈ షో గ‌త వారం 9 రేటింగ్ పాయింట్లని సాధించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇదే స‌మ‌యంలో జ‌బ‌ర్ద‌స్త్‌కు కేవ‌లం 7 శాతం మాత్ర‌మే రేటింగ్ రావ‌డం గ‌మ‌నార్హం. 'కామెడీ స్టార్స్‌' షో ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 1:30కు స్టార్ మాలో ప్ర‌సారం అవుతోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.