English | Telugu

పెళ్లికూతురు గెట‌ప్‌లో అరియానా.. మేట‌ర్ ఏంటి?

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి అతి తక్కువ సమయంలో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంది అరియానా గ్లోరీ. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి తన పాపులారిటీ పెంచుకున్న ఈ భామ.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది. తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె బిహేవియర్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. సెలబ్రిటీలు సైతం అరియానాను ఇష్టపడ్డారు. తాజాగా అరియానాకు చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ న్యూస్ ఏంటంటే.. ఈ బ్యూటీ త్వరలోనే మిసెస్ కాబోతుందని టాక్ . అయితే ఈమె పెళ్లి చేసుకునే అబ్బాయి ఎవరనే దానిపై క్లారిటీ లేదు. మరోపక్క ఈ ఏడాదిలోనే తన పెళ్లి ఉంటుందని కమెడియన్ అవినాష్ చెప్పాడు. మంచి ముహుర్తాలు ఉంటే పెళ్లికి రెడీ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో అరియానా పెళ్లి మ్యాటర్ బయటకి రావడంతో ఫ్యాన్స్.. అరియనాకు అవినాష్‌తో పెళ్లి అంటూ ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ షోలో వీరిద్దరూ ఎంతో క్లోజ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ప్ర‌చారాన్ని ఈ జంట కొట్టిపారేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది.

అయితే ఈ పెళ్లి వార్తలపై మాత్రం ఈ జంట ఇంకా స్పందించలేదు. కానీ అరియానా సన్నిహితులు మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ఇటీవల అరియానా ఓ గోల్డ్ జువెల్లర్ బ్రాండ్ కోసం ఫోటో షూట్ చేసిందని.. ఆ కమర్షియల్ యాడ్ కోసం పెళ్లికూతురు గెటప్‌లో దర్శనమివ్వడంతో అందరూ తనను అపార్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలో అరియానా ఓ కీలకపాత్ర పోషిస్తోంది. అలానే పలు టీవీ షోల్లో పాల్గొంటోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.