English | Telugu

థాంక్యూ రాహుల్‌.. నాకు ఏడుపొచ్చేస్తోంది!

బిగ్ బాస్ షోతో చాలా మంది తారలు ఫేమస్ అయ్యారు. ప్రజలకు తెలియని ఎంతో మంది టాలెంట్స్‌ను బిగ్ బాస్ వేదిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ కేటగిరీలోకి రాహుల్ సిప్లిగంజ్, అషురెడ్డి కూడా వస్తారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరువాత వారి క్రేజ్ అమాంతం పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన రాహుల్ తన పాటలతో రోజురోజుకి పాపులారిటీ పెంచుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు రాహుల్.. పునర్నవి భూపాలంతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆమె కూడా రాహుల్‌ని ముద్దులు, కౌగిలింతలతో ముంచెత్తేది.

దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని.. పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా ఈ జంట పార్టీలు, ఈవెంట్స్ అంటూ హల్చల్ చేసింది. అయితే సడెన్‌గా సీన్ లోకి అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. రాహుల్-అషురెడ్డి సన్నిహితంగా మెలగడంతో రాహుల్ ఆమెతో ప్రేమలో పడ్డాడేమో అని అందరూ అనుకున్నారు. దీనికితోడు రాహుల్.. అషురెడ్డిని ఎత్తుకున్న ఫోటోలు వైరల్ అవ్వడంతో వీరి రిలేషన్ జనాల్లో హాట్ టాపిగ్‌గా మారింది.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అషురెడ్డితో డేటింగ్ విషయంపై స్పందించాడు రాహుల్. తనకు అషురెడ్డి చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చిన అత‌ను.. అషు చూపించే కేరింగ్ తనకు చాలా ఇష్టమని అన్నాడు. అయితే తమ మధ్య డేటింగ్ లాంటిది ఏమీ లేదని.. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్య ఓ సారి డబ్బులు అవసరమై అషుని పది వేలు అడిగానని.. ఆమె వెంటనే డబ్బు పంపించిందని.. వేరే వాళ్లను ఇలా అడగలేనని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన అషు ఎమోషనల్ అయింది. ''థాంక్యూ రాహుల్.. నాకు ఏడుపొచ్చేస్తోంది.. నువ్వు ఎప్పటికీ స్పెషల్'' అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.