English | Telugu

నో క్లీవేజ్ షో.. నో ఎక్స్‌పోజింగ్!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ. ప్రస్తుతం పలు టీవీ షోలతో అమ్మడు చాలా బిజీ అయింది. ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది రష్మీ. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. బుల్లితెరపై తన సత్తా చాటినప్పటికీ వెండితెరపై మాత్రం సరైన గుర్తింపు సంపాదించలేకపోయింది. కానీ వస్తోన్న సినిమా అవకాశాలు మాత్రం అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన 'బొమ్మ బ్లాక్‌బస్టర్' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో రష్మీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేకపోతున్నామని వెల్లడించింది. థియేటర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని.. కానీ థియేటర్లో వస్తుందా లేక ఓటీటీలో వస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదని చెప్పింది. ఇక వెండితెరపై ఇప్పటివరకు తను చాలా గ్లామరస్ గా కనిపించడం, గ్లామరస్ రోల్స్ లో నటించడంతో అందరూ తనను సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారని.. తొలిసారి తను 'బొమ్మ బ్లాక్‌బస్టర్' సినిమాలో డీగ్లామరస్ రోల్ లో నటించానని తెలిపింది.

ఇందులో క్లీవేజ్ షో, నడుము చూపించడాలు ఉండవంటూ చెప్పుకొచ్చింది. సినిమాలో తను వేసుకునే కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయని.. గ్లామర్ షోకి దూరంగా ఉండే పాత్ర అని చెప్పింది. చాలా మంది తనను యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న పాత్రలు చేయరా..? అని అడుగుతున్నారని.. అందుకే ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తున్నానని.. తనపై విమర్శలు చేసే వారికోసమే ఈ సినిమా చేశానని స్పష్టం చేసింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.