English | Telugu

ఆ గొర్రెల మంద నన్ను కూడా టార్గెట్ చేసింది!

'జబర్దస్త్'కి అనసూయ ఎంత గ్లామర్ ని పంచిందో అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఇటీవల ఆమె ఈ షో నుంచి పక్కకు తప్పుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ కూడా వచ్చాయి. ఐతే ఒక ఇంటర్వ్యూలో వీటికి సమాధానం చెప్పింది అనసూయ. వరుసగా మూవీ ఆఫర్స్ వస్తూండేసరికి తప్పక షో నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. అలాగే తనకు ఆఫర్స్ వచ్చినప్పుడల్లా డేట్స్ అడ్జస్ట్ చేయమని ప్రతీసారి అడగలేను కదా.. చాలా గిల్టీగా అనిపిస్తోంది.

అలాగే అందరూ కూడా తన వల్ల ఇబ్బందులు పడడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్పి ఎమోషన్ అయ్యింది అనసూయ. ఈ కార్యక్రమం ఎప్పుడూ బోరింగ్ గా అనిపించలేదు కానీ కొంతకాలం నుంచి ఈ ప్లేస్ తనది కాదు అని అనిపించే సంఘటనలు జరుగుతుండేసరికి తనకు ఈ షో చేయకుండా కొంత టైం గ్యాప్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. "గ్లామర్ ఫీల్డ్ అంటేనే అంత. ఎన్నో కామెంట్స్ వస్తాయి. వాటిని భరించక తప్పదు. వెళ్లిపోయిన వాళ్ళ వెంట మిగతా వాళ్ళు వెళ్లిపోవడానికి ఎవరూ కూడా గొర్రెల మంద అసలే కాదు" అంటూ మనసులో మాట ఈ ఇంటర్వ్యూలో చెప్పింది అనసూయ.

బాడీ షేమింగ్ కి సంబంధించి ఎప్పుడూ నేను వ్యతిరేకమే. అలాంటి సీన్స్ ని నేను అస్సలు ఎంటర్టైన్ చేయను. అలాంటి టైంలోనా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని చూపించరు. దీంతో ఆడియన్స్ కి తెర మీద ఏది చూపిస్తారో అదే ఆ మనిషి వ్యక్తిత్వం అని అనుకుంటారు. అలాగే న‌న్ను ఒక గొర్రెల మంద ఎటాక్ చేసింది. ఎందుకంటే న‌న్ను కూడా ఆ మందలో చేర్చడం కోసం. అని ఆమె తెలిపింది. కానీ తాను ఆ ఇష్యూస్ అన్నిటి నుంచి కూడా బయటపడినట్లు చెప్పిందామె.

"జబర్దస్త్ లో తీసుకున్న జీతానికి సరిపడా పని చేసాను. నాకు టీఆర్పీ విషయాలు కూడా తెలియవు. నేను ఎలా పెర్ఫామ్ చేయాలి అనుకున్నానో అలాగే చేసాను. ఎప్పుడూ ఎవరితో కూడా తప్పు చేశాననే మాటను అసలు అనిపించుకోలేదు." అని చెప్పింది అనసూయ.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.