English | Telugu

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం


ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు.

"వివాహయోగం మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం" అని చదివాడు. వెంటనే జడ్జ్ రాధికా శరత్ కుమార్ "పాయింట్ కి వచ్చారు ఇప్పుడే" అన్నారు. "కావ్య లాంటి మంచి ప్లేయర్ ని తీసుకొచ్చాను అని చెప్పడానికి" అన్నాడు సుధీర్. "ఆవిడని ప్లేయర్ అంటున్నావు కానీ ఆటలన్నీ నువ్వే ఆడుతున్నావ్ స్టేజి మీద" అనేసింది నిహారిక. "కావ్య నువ్వు చూసి పెట్టాలి నాన్న డబ్బులు" అన్నాడు. "నెక్స్ట్ టైం నువ్వు వెళ్లి పెట్టు" అంటూ నిహారిక సెటైర్ వేసింది. "అరేయ్ బాబు ఇంకా నేనేం మాట్లాడాను" అంటూ సుధీర్ ఫీలైపోయాడు. ఇక ఫైనల్ లో "ఓ చెలియా నా ప్రియా సఖియా" అనే సాంగ్ కి ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఇక నెటిజన్స్ ఐతే కావ్య సైడ్ సుధీర్ స్టాండ్ తీసుకున్నాడు గ్రేట్. సుధీర్ - కావ్య జోడి ట్రెండింగ్ లో ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టైటానిక్ మూవీలో హీరో హీరోయిన్స్ లా ఉన్నారు అంటూ కొంతమంది. సుధీర్ - రష్మీ జోడీని బాగుంది ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు

.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.