English | Telugu
Jayam serial: రుద్రకి సన్మానం.. వీరు, పారుల ప్లాన్ ఏంటంటే?
Updated : Feb 1, 2026
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -182 లో... గంగపై ఇంట్లో అందరు కోప్పడతారు. రుద్ర కోపంగా ఉంటాడు. తన దగ్గరికి గంగ వచ్చి, సారీ చెప్తుంది. నువ్వు ఎందుకు ప్రతీసారీ వీరుని టార్గెట్ చేస్తున్నావని రుద్ర అడుగుతాడు. మీకు అంతా వివరంగా చెప్పగలను కానీ సాక్ష్యాలు చూపించలేనని మళ్ళీ వీరు గురించి అంటుంటే రుద్రకి ఇంకా కోపం వస్తుంది.
ఆ తర్వాత థాంక్స్ ఇషిక.. టైమ్ కి రింగ్ ఇచ్చి సేవ్ చేసావని ఇషికతో వీరు అంటాడు. ఆ గ్యాంగ్ లో గంగ ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక దాని టెన్షన్ ఉండొద్దు లేపెయ్యాలని ఇషికతో వీరు అంటాడు. ఆ తర్వాత ప్రీతీకి గంగ సారీ చెప్పగానే ప్రీతీ కూల్ అవుతుంది.
ఆ తర్వాత సీఎం పీఏ పెద్దసారు దగ్గరికి వస్తాడు. మీ అబ్బాయి నిన్న ఒక మాఫియా నుండి కొంతమంది అమ్మాయిలని సేవ్ చేసాడని సన్మానం చెయ్యాలని డిసైడ్ అయ్యారని చెప్పగానే ఇంట్లో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట సన్మానం.. ఇంట్లో అవమానం అని శకుంతల అంటుంది. నువ్వు రావా రేపు అని పెద్దసారు అనగానే రానని శకుంతల చెప్తుంది. పెద్దమ్మ రాకుంటే వద్దని రుద్ర అంటాడు. మీ పెద్దమ్మని నేను ఒప్పిస్తానని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత పెద్దసారు శకుంతల దగ్గరికి వెళ్లి రేపు ప్రశంసలు మొత్తం నేనే తీసుకోవాలా.. నీకు వద్దా అని మాట్లాడుతుంటే శకుంతల ఒప్పుకుంటుంది.
ఆ తర్వాత ప్రీతీ దగ్గరికి రుద్ర వచ్చి సారీ చెప్తాడు. నేను ఎప్పుడో మార్చిపోయాను అన్నయ్య.. గంగ ఏది అనుకుంటే అదే మాట్లాడుతుంది. మనసులో ఏం దాచుకోదని ప్రీతీ అంటుంది. గంగ దగ్గరికి రుద్ర వెళ్లి సన్మానానికి ఈ చీర కట్టుకోమని చెప్తాడు. కానీ కట్టుకోనని గంగ అంటుంటే నిన్ను ఇలా కాదు అని తన చేయి మెలి పెడతాడు రుద్ర. దాంతో రుద్రని గంగ హగ్ చేసుకొని.. మీరు నాకు దూరం అయితే నేను తట్టుకోలేనని ఏడుస్తుంది.
మరొకవైపు సన్మానం గురించి ఇషిక, వీరు మాట్లాడుకుంటారు. అప్పుడే పారు ఫోన్ చేస్తుంది. తనకి జరిగిందంతా చెప్తారు. దాంతో పారు ఒక ప్లాన్ వాళ్లకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.