English | Telugu

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి హీరోయిన్ గా రష్మీనే అనుకున్నారట

జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో వచ్చేసింది. ఇందులో పృద్వి స్కిట్ రష్మీ మీద చేస్తున్నట్టు కనిపిస్తోంది. పృద్వి లంగావోణీ వేసుకుని "చంద్రుళ్ళో ఉండే కుందేలు" అనే సాంగ్ కి డాన్స్ వేసుకుంటూ వచ్చింది. "ఈరోజు నా లిల్లీ పెళ్లి అందువల్లే కార్డులు పంచడానికి వచ్చాను" అంటూ ఒక కాగితాన్ని రష్మీ చేతికి ఇచ్చి ఏడవడం మొదలుపెట్టాడు. "ఏమైంది పృద్వి ఏడుస్తున్నావ్" అని అడిగింది. "ఊళ్ళో ఎవరెవరికో పెళ్ళిళ్ళైపోతున్నాయి. ఊరు పుట్టక ముందు నువ్వు పుట్టావ్...నీకు అవలేదు కదా ఇంకా" అనేసరికి రష్మీ మూతి తిప్పుకుంది. "అసలేం మాట్లాడుతున్నావ్. ప్రభాస్ సర్ ఏమన్నారు. సీనియర్స్ తర్వాతే మేము అన్నారు." అంది రష్మీ "ఆయన సీనియర్స్ తర్వాత మేము అన్నాడు ముస్లలోళ్ళ తర్వాత అనలేదు" అంటూ పృద్వి మళ్ళీ సెటైర్ వేసాడు.

"నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి హీరోయిన్ గా ఫస్ట్ నన్ను అడిగారు తెలుసా" అంది రష్మీ. "నువ్వే వస్తాను అనుంటావ్ వాళ్ళే వద్దని ఉంటారు" అంటూ పృద్వి మళ్ళీ కౌంటర్ వేసాడు. ఇక తర్వాత రాంప్రసాద్ "టు రోజెస్ బ్యూటీ పార్లర్" అని పెట్టాడు. "నీకొక ఆఫర్ ఇస్తున్నా రష్మీ. బేసిక్ గా మన పార్లర్ లో అందంగా లేని అమ్మాయిలు ఫేషియల్ చేసుకుంటే పది వేలు తీసుకుంటాం. అందమైన అమ్మాయిలు చేయించుకుంటే జస్ట్ వెయ్యి రూపాయలు తీసుకుంటాం" అన్నాడు. "ఐతే నాకు వెయ్యి రూపాయలేనా" అని రష్మీ చాలా ఆసక్తిగా అడిగింది. "నీకు పది వేలు తీసుకుంటాం" అన్నాడు రాంప్రసాద్. అంతే రష్మికి కోపమొచ్చేసింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.