English | Telugu

ఘనంగా యాదమ్మ రాజు పెళ్లి వేడుకలు..హాజరైన సెలబ్రిటీస్

"పటాస్" కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు యాదమ్మ రాజు. బుల్లితెర మీద కనిపిస్తూనే అటు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అమాయకమైన హావభావాలతో ఆడియన్స్ ని నవ్వించడం ఇతని స్టైల్. తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా నడుపుతున్నాడు. మొన్న హల్దీ వేడుకల ఫోటోలు వైరల్ ఆయాయ్యి.

ఇక ఇప్పుడు వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగిపోయింది. వీళ్ళ ఇద్దరి పెళ్ళికి బిగ్ బాస్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్లు సోహెల్, ముక్కు అవినాష్, హైపర్ ఆది, పరదేశి, శ్రీవాణి ఫామిలీ, నాగబాబు, వేణు వండర్స్, ఆకాష్ పూరి, డాన్సర్ పండు, శేఖర్ మాస్టర్, యాంకర్ శివ, ఇక కామెడీ స్టాక్ ఎక్స్చేంజి షో కమెడియన్స్ అంత వీళ్ళ పెళ్ళికి వచ్చి విషెస్ చెప్పారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.