English | Telugu
ఘనంగా అమరదీప్, తేజు హల్దీ వేడుకలు!
Updated : Dec 12, 2022
అమర్ దీప్ చౌదరి ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో ఫుల్ ఫేమస్ ఐన నటుడు. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా "ఐరావతం" అనే మూవీలో కూడా మెరిశాడు. ఇక అలాంటి అమర్ దీప్ కు రీసెంట్ గా ‘ కోయిలమ్మ’ సీరియల్ ఫేమ్ తేజస్విని గౌడ తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఇప్పుడు వీరి పెళ్లి డేట్ దగ్గర పడుతుండేసరికి ఏర్పాట్లు కూడా మొదలైపోయాయి. తేజస్విని గౌడ.. తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఇక అమర్ దీప్ ను కూడా వాళ్ళ ఫామిలీ మెంబర్స్ పెళ్లి కొడుకును చేశారు. హల్దీ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. పసుపు కొట్టే కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి.
ఇక ఇప్పుడు అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. అమర్ దీప్ ను అభినందించేవారు.. అలాగే అతని ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు.