English | Telugu

ఒక కామెడీ రోల్ లో మీరే చేయాలి అని అడిగినందుకు ఆయన చేసిన పని ఇది!

ఒక కామెడీ రోల్ లో మీరే చేయాలి అని అడిగినందుకు ఆయన చేసిన పని ఇది!

"ఆలీతో సరదాగా" షోకి ఈ వారం రాహుల్ సిప్లిగంజ్, సోహైల్ ఇద్దరూ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీళ్ళిద్దరూ ఎన్నో విషయాలు ఈ షోలో చెప్పారు. ఇక సోహైల్ ఆలీ సర్ గురించి మీకెవ్వరికీ తెలియని ఒక విషయం చెప్తాను అని అన్నాడు " నేను ఆలీ సర్ ఒక ఫంక్షన్ లో కలిసాము  అంతే..ప్రత్యేక పరిచయం అంటూ ఏమీ లేదు. 

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాగానే "మిస్టర్ ప్రెగ్నెంట్" అనే ఒక మూవీ చేసాను. ఆ మూవీలో కామెడీ డాక్టర్ గా చేయడానికి ఒక రోల్ ఉంది. దానికి ఒక వ్యక్తి కావాలి అనేసరికి సెట్ లో అంతా  ఆలీ సర్ ఐతే కరెక్ట్ అని చెప్పేసరికి నేను ఆయనకు ఫోన్ చేసాను. ఫోన్ తీసి చెప్పు సోహైల్ అన్నారు  బాగా పరిచయమున్న వ్యక్తిలా..దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. 

తర్వాత ఇలా ఈ మూవీ విషయం అందులో పాత్ర గురించి చెప్పాను...ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చుకునే పరిస్థితి లేదని చెప్పాను. ఆయన అవేమీ ఆలోచించకుండా వచ్చి ఆ రోల్ చేసి వెళ్లారు. మాలాంటి ఎంతో మందిని ఆయన ఇలా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మణికొండ నుంచి కొంపల్లి దాకా అంటే రెండు గంటలు ప్రయాణం చేసి నా కోసం వచ్చి ఆ రోల్ చేసి వెళ్లారు " దానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నా అని ఈ షోలో సోహైల్ ఆలీ గురించి చెప్పారు.