English | Telugu

చిరంజీవి మనసులో జూనియర్ పూజా హెగ్డే!

ఆహా ఓటిటి పై తెలుగు ఇండియన్ ఐడల్ షో మంచి స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఎవరు అనే విషయం తేల్చాల్సిన సమయం వచ్చేసింది. ఈ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ రాబోతున్నారు. ఆయన చేతులమీదుగా ఇండియన్ ఐడల్ టైటిల్ ని విన్నర్ కి అందించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ టైంలో చిరంజీవి వాగ్దేవి మీద ఒక కవితను చెప్పారు.

"డియర్ వాగ్దేవి, నువ్వు నా మనసులో జూనియర్ పూజా హెగ్డేవి, నా రూములో పెట్టుకున్న ఫోటో నీది..." అంటూ గుటకలు మింగుతూ "ఇది నేను రాయలేదు ప్రామిస్" అంటూ చిరంజీవి వాగ్దేవి గురించి చదివిన కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు ఫైనల్ స్టేజికి వచ్చేసింది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్స్ ఇండియన్ ఐడల్ టైటిల్ కోసం పోటీపడబోతున్నారు. ఈ ఐదుగురిలో వాగ్దేవి ఒకరు. 17 న జరగబోయే తెలుగు ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే కాస్త మెగాస్టార్ రాకతో మెగా ఫినాలేగా మారబోతోంది.

ఇక వాగ్దేవి తన హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేసుకుంది. బాలయ్య, మెగాస్టార్ ఇద్దరూ కూడా వాగ్దేవిని పూజా హెగ్డేతో పోల్చడం, తను సంతోషపడడం స్టేజి మీద చూసాం. బాలయ్య కూడా ఈ షోకి వచ్చి ఒక బిరుదు ఇచ్చేసారు. వాగ్దేవి కాదు వావ్ దేవి అని. ఈ మెగా ఫినాలే ఎపిసోడ్ ప్రోమో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. మరి ఈ మెగా ఫినాలేలో వాగ్దేవి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలంటే కాసేపు వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.