English | Telugu

తన కంటెస్టెంట్ అప్పుల్ని తీరుస్తాను అని గొప్ప మనసును చాటుకున్న సుదర్శన్ మాస్టర్!


ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ షోలో కంటెస్టెంట్ రాహుల్, అతని కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్ తో కలిసి వచ్చి స్టేజి మీద డాన్స్ ని ఇరగదీసాడు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ అయ్యాక ప్రదీప్ వాళ్ళ అమ్మను, తమ్ముడు రుతురాజ్ ను స్టేజి మీదకు పిలిచాడు. వాళ్ళను అలా చూసేసరికి రాహుల్ ఏడ్చేశాడు. తన తమ్ముడు స్పెషల్ పర్సన్ అని చెవుడు, మూగ అని చెప్పాడు. రెండు రోజుల క్రితం వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇంటర్నల్ గా బ్లీడింగ్ అవుతోంది ముక్కులోంచి రక్తమొస్తోందని చెప్పేసరికి తనకు ఏం చేయాలో అర్ధం కాలేదన్నాడు.

ఇక రాహుల్ వాళ్ళ అమ్మ మాట్లాడుతో "నేను ఇళ్లల్లో పాచిపని చేస్తూ ఉంటాను. కానీ ఇంట్లోకి సరిపడినంత డబ్బులు కూడా ఉండవు. రాహుల్ ఇలా డాన్స్ షోకి వస్తాను అన్నప్పుడు ఏం చేయాలో అర్ధం కాలేదు. అందరి దగ్గరా డబ్బులు పోగేసి ఇలా పోటీలకు పంపించాను. ఇప్పుడు నా బిడ్డ నా పేరు నిలబెట్టాడు" అని ఏడుస్తూ గర్వంగా చెప్పింది. ఇక సుదర్శన్ మాస్టర్ తన కంటెస్టెంట్ కోసం తన ఉదారతను చాటాడు. "ఇలాంటి మంచి డాన్సర్ ని మాకు అందించారు. రాహుల్ కి ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ నేను తీర్చడానికి సాయం చేస్తాను. ఈసారి వచ్చే పేమెంట్ మొత్తం రాహుల్ ఫామిలీకి ఇచ్చేస్తాను" అని చెప్పాడు.

ఇక ప్రభుదేవా కూడా "నీకేం భయం అక్కర్లేదు మేమంతా ఉన్నాం, ఈ ఢీ టీమ్ అంతా నీ వెనక ఉంది...భయపడకు, నీ డాన్స్ నువ్వు పర్ఫెక్ట్ గా చెయ్యి" అని అభయమిచ్చారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.