English | Telugu

స్టార్ మా ప‌రివార్: దేవత vs రాఖీ పూర్ణిమ

ప్ర‌తీ ఆదివారం `స్టార్ మా`లోని పాపుల‌ర్‌ టీవీ సీరియ‌ల్ న‌టీన‌టులతో యాంకర్ ఝాన్సీ నిర్వ‌హిస్తున్న షో `స్టార్ మా ప‌రివార్ లీగ్‌`. గ‌త కొన్ని వారాలుగా సీరియ‌ల్ న‌టీన‌టుల‌తో ఆస‌క్తికంగా సాగుతున్న ఈ షో ఈ ఆదివారం సెమీ ఫైన‌ల్ కి చేరింది. ఈ సెమీస్ లో దేవత, రాఖీ పూర్ణిమ సీరియ‌ల్స్ నువ్వా నేనా అంటూ పోటీప‌డుతున్నాయి. దేవ‌త సీరియ‌ల్ నుంచి అర్జున్ అంబ‌టి, సుహాసిని, కుమారి తో పాటు ఓ బాల‌న‌టి తో క‌లిసి మొత్తం న‌లుగురు హాజ‌ర‌య్యారు.

రాఖీ పూర్ణిమ సీరియ‌ల్ నుంచి మ‌ధుబాబు, లిఖితా మూర్తి, సూర‌జ్‌, సుష్మిత మ‌రో న‌టీ హజ‌ర‌య్యారు. షో మ‌ధ్య‌లో టీవీ న‌టుడు అమ‌ర్ దీప్ చౌద‌రి రాఖీ భాయ్ లా సుత్తి ప‌ట్టుకుని ఎంట్రీ ఇచ్చి హంగామా చేశాడు. దేవత, రాఖీ పూర్ణిమ టీమ్ ల మ‌ధ్య ఓ రేంజ్ లో పోటీ జ‌రిగింది. టీమ్ లీడ‌ర్ లుగా మ‌ధు బాబు, అర్జున్ అంబ‌టిల‌ని స్టేజ్ పైకి పిలిచిన యాంక‌ర్ ఝూన్సీ మీమీ హీరోయిన్స్ ని కూడా తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం అని తెలిపింది. దీంతో అర్జున్ అక్క‌డ ముగ్గురున్నారు అందులో ఎవ‌రిని పిల‌వాలో డిసైడ్ చేసుకోవాల‌న్నాడు.. ఇంత‌లో `నువ్వు బాగా తెగించావురా` అంటూ బ్ర‌హ్మీ డైలాగ్ ని వేసి న‌వ్వులు పూయించారు.

ఆ త‌రువాత రాఖీ పూర్ణిమ సీరియ‌ల్ నుంచి మ‌ధుబాబు తో క‌లిసి మ‌రో ఇద్ద‌రు `మ‌మ మ‌మ మ‌హేష్‌.. `అంటూ సాగే పాట‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. ఆ త‌రువాత `దేవ‌త‌` సీరియ‌ల్ టీమ్ నుంచి అర్జున్‌, సుహాసిని `దేవ‌త‌` సినిమాలోని `యెల్లువ‌చ్చె గోదార‌మ్మా...` పాట‌కు స్టెప్పులేసి ఆక‌ట్టుకున్నారు. మ‌ధ్య‌లో అర్జున్ పై `రాఖీ పూర్ణిమ‌` టీమ్ కు చెందిన సుష్మిత వేసిన పంచ్ లు న‌వ్వులు పూయించాయి. ఆ త‌రువాత సెట్ లో సుహాసిని చేసే హ‌డావిడీ ని అనుక‌రించాడు అర్జున్ అంబటి. ఆ వెంట‌నే `రాఖీ పూర్ణిమ‌` నుంచి మ‌ధుబాబు టీమ్ `రంగ‌స్థ‌లం`నుంచి ఆగ‌ట్టు నుంటావా? .. పాట‌కు అద‌రిపోయే చిందులేశారు. ఫైన‌ల్ గా మ‌హిశాసుర మ‌ర్థిని రూప‌రాన్ని అర్జున్ అంబ‌టి బృందం చేసిన ప్ర‌ద‌ర్శన ఆక‌ట్టుకుంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.