English | Telugu

మళ్ళీ మల్లెమాల గూటికి శేఖర్ మాస్టర్!

డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో శేఖర్ మాస్టర్ వెలుగులోకి వచ్చారు. ఆ షోతో అతడికి ఎంతో పేరొచ్చింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా పేరొచ్చిన తర్వాత జడ్జ్‌గా పేరు తీసుకొచ్చినది కూడా 'ఢీ' షోనే. అటువంటి 'ఢీ' నుండి శేఖర్ మాస్టర్ బయటకు రావాల్సి వచ్చింది. స్టార్ మా ఛాన‌ల్‌లో 'కామెడీ స్టార్స్'లో జ‌డ్జ్‌గా చేస్తుండటంతో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ 'ఢీ' నుండి అతడిని తప్పించింది. గణేష్ మాస్టర్‌ను జ‌డ్జ్‌గా తీసుకొచ్చింది.

ఇప్పుడు చాలా రోజుల తర్వాత మల్లెమాల గూటిలో శేఖర్ మాస్టార్‌కు చోటు దక్కింది. 'జబర్దస్త్', 'ఎక్ట్రా జబర్దస్త్', 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోలు ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఫెస్టివల్ స్పెషల్ కింద పండగలకు ఈటీవీ కోసం మల్లెమాల ఈవెంట్లు చేస్తుంది. దసరా కోసం చేసిన ఈవెంట్‌లో శేఖర్ మాస్టర్ ఉన్నారు.

రోజా, శేఖర్ మాస్టర్ ఈవెంట్స్‌లో చేసే డాన్స్ పెర్ఫార్మన్స్‌లు హిట్ అయ్యాయి. అలాగే, గతంలో సదాతో కలిసి 'ఢీ' జ‌డ్జ్‌గా చేశారు శేఖర్. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి 'దసరా బుల్లోళ్ళు' కార్యక్రమంలో స్టెప్పులు వేశారు.