English | Telugu
దివిపై కేసు పెట్టండి.. అందంతో చంపేస్తోంది!
Updated : Jul 22, 2022
"ఏ దివిలో విరిసిన పారిజాతమో" అన్న పాటకు తగ్గట్టుగా తన అందంతో అట్రాక్షన్ తో సోషల్ మీడియాని షాక్ చేసేస్తోంది దివి. ఈ యంగ్ బ్యూటీ ఎలాంటి డ్రెస్ వేసినా మెరిసిపోతూ ఉంటుంది. ప్రస్తుతం "పరంపర" అనే వెబ్ సిరీస్ లో నటించింది దివి. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా దివి వంకాయ రంగు డ్రెస్ లో అద్దిరిపోయింది. ఈ ఫొటోస్ అన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 'దివి చూపుల్లో ఏదో మేజిక్ ఉంది, మేజిక్ అంటే దివి, దివి అంటే మ్యాజిక్' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐతే ఒక నెటిజన్ మాత్రం "దివిపై కేసు పెట్టండి సర్.. అందంతో చంపేస్తోంది" అంటూ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దివి లాస్ట్ ఇయర్ "క్యాబ్ స్టోరీస్ " అనే వెబ్ సిరీస్‌లో నటించింది. పల్లెటూరి కాస్ట్యూమ్స్ తో దివి ఎక్కువ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రాబోయే కాలానికి కాబోయే టాలీవుడ్ యాక్టర్ లా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తన సహజమైన గ్లామర్ తో దివి సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
బిగ్ బాస్ లాంటి షోస్ లో, అవార్డు ఫంక్షన్స్ స్టేజెస్ మీద చేసే హాట్ డాన్సస్ కి దివి బోల్డంత పేరు తెచ్చుకుంది. ఇలాంటి షోస్ లో పార్టిసిపేట్ చేసేసరికి ఆమె టాలెంట్ కూడా బయట పడుతోంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కంట్లో పడి మంచి హీరోయిన్ గా ఎదిగే ఛాన్సెస్ కోసం దివి నెమ్మదిగా రూట్ క్లియర్ చేసుకుంటోంది.