English | Telugu

ఇనయా.. పొద్దుతిరుగుడు పువ్వు!

బిగ్ బాస్ హౌస్ లో రిలేషన్స్ లాగా కలిసిపోయి, విడిపోతూ ఉంటారు కంటెస్టెంట్స్. అయితే కొందరు మాత్రం, ఆటలో పెర్ఫార్మన్స్ కంటే కూడా మిగతా వారిని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. కాగా ఈ మధ్య సూర్య తో ఎక్కువ సన్నిహితంగా ఉంటోంది ఇనయా.

ఈ విషయమే ఇప్పుడు బిగ్ బాస్ ప్రేక్షకులకు, హౌస్ మేట్స్ కి కొత్త ప్రేమ కథలా తోస్తోంది. ఇలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. మొన్న జరిగిన టాస్క్ లో " హౌస్ లో నీ క్రష్ ఎవరూ? ఎందకు?" అని బిగ్ బాస్ అడుగగా, "సూర్య అంటే నాకు‌ ఇష్టం అని" చెప్పేసింది. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే. అయితే సూర్య కూడా ఆరోహి వెళ్ళిపోయినా తరువాత ఇనయాతో ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నాడు. ఇనయా కూడా సేమ్ అలానే ప్రవర్తిస్తోంది. తను గేమ్ పై ఫోకస్ చేయట్లేదు అని శనివారం రోజు నాగార్జున చెప్పడం జరిగింది. కాగా ఎప్పుడు కూడా సూర్య పక్కనే కన్పించడం, ప్రేక్షకులకు సైతం ఉన్న డౌట్స్ ని క్లియర్ చేసింది. నాగార్జున ఒక గేమ్ లో కూడా బజర్ దగ్గర సూర్య, ఇనయా ఉండగా, "దూరంగా ఉండు బజర్ కి కాదు ఇనయాకి" అని అన్నాడు. ఇనయా మాత్రం హౌస్ లోకి ఒక సూర్య కోసం మాత్రమే వచ్చినట్టుగా ప్రవర్తిస్తోంది. ఇనయ మొదటి రెండు వారాలు సూపర్ గా అడి, నాగార్జున మెప్పుపొందింది. కాగా ఈ శనివారం మాత్రం "పర్ఫామెన్స్ సరిగ్గా లేదని గేమ్ మీద పెట్టు దృష్టిని" అని చిన్నగా హెచ్చరించాడు.

నాగార్జున, ఇనయాని "పొద్దుతిరుగుడు పువ్వు లాగా సూర్య వైపే ఉంటున్నావ్" అని అనడం తో, "అలాగేం‌ లేదు సర్, ఇక నుండి ఆలా ఏం ఉండదు." అంటోంది ఇనయ. ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అని నాగార్జున , సుదీపతో అనగా, సుదీప మాట్లాడుతూ, "సూర్య ఉన్నాడుగా, అందుకే నవ్వుతూనే ఉంటుంది" అని చెప్పింది. ఈ రోజు ఇచ్చిన టాస్క్ లో కూడా 'సొల్లు ఆపు దమ్ముంటే నన్ను ఆపు' అనే ట్యాగ్ డైలాగ్ ఉన్న బోర్డు వేసి వివరించింది. "మొన్న టాస్క్ లో నన్ను ఆడనివ్వడం లేదు సార్. నా చేతిలోని బాల్ ని లాగేసుకున్నాడు" అని చెప్పడం తో సూర్య మట్లాడుతూ, "లాగేసుకోవడం కాదు సార్, నేను గేమ్ ఆడుతున్న" అని చెప్పాడు. దానికి సమాధానంగా, "దమ్ముంటే ఇక ముందు ఆపు" అంటూ సెటైర్లు వేసింది ఇనయా.

రాబోయే రోజుల్లో ఇనయ ఆటలో పెర్ఫార్మన్స్ చూపిస్తుందో లేక క్రష్ అనుకుంటూ, సూర్య వెనకాల తిరుగుతుందో చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.